Nabha Natesh and Ritu Varma Shared Gym Workout Video
Nabha Natesh – Ritu Varma : మన సెలబ్రిటీలు అప్పుడప్పుడు జిమ్ వర్కౌట్ వీడియోలు షేర్ చేస్తారని తెలిసిందే. చాలా మంది హీరోయిన్స్ రెగ్యులర్ గా జిమ్ వర్కౌట్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇద్దరు హీరోయిన్స్ కలిసి ఒకేచోట జిమ్ వర్కౌట్స్ చేసిన వీడియోని షేర్ చేసారు.
యువ హీరోయిన్స్ నభా నటేష్, రీతూ వర్మ కలిసి జిమ్ లో కష్టపడుతున్న వీడియోని తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఎక్సర్ సైజ్ లు, బరువులు ఎత్తడాలు, రకరకాల జిమ్ వర్కౌట్స్ చేసి చివర్లో సెల్ఫీలు దిగారు ఈ ఇద్దరు హీరోయిన్స్. ఒక హీరోయిన్ వర్కౌట్ వీడియో పెడితేనే ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తారు. ఇక ఇద్దరు హీరోయిన్స్ కలిసి వర్కౌట్స్ చేస్తే ఆ వీడియో వైరల్ అవ్వకుండా ఉంటుందా.. మీరు కూడా నభా నటేష్, రీతూ వర్మ కలిసి చేసిన జిమ్ వర్కౌట్ వీడియో చూసేయండి..
ఇక నభా నటేష్ ఇటీవలే డార్లింగ్ సినిమాతో ప్రేక్షకులని మెప్పించింది. త్వరలోనే స్వయంభు సినిమాతో రానుంది. రీతూ వర్మ త్వరలో స్వాగ్ సినిమాతో రాబోతుంది.