×
Ad

Niharika – Akira : అసలు అకిరా సినిమాల్లోకి వస్తాడా అని కూడా నేను అడగలేదు.. అకిరా సినీ ఎంట్రీపై నిహారిక వ్యాఖ్యలు..

ఫ్యాన్స్ మాత్రం అకిరాని హీరోగా చూడాలని అనుకుంటుండటంతో మెగా ఫ్యామిలీకి ప్రతిసారి అకిరా సినీ ఎంట్రీపై ప్రశ్నలు ఎదురు అవుతూనే ఉన్నాయి.

  • Published On : September 11, 2024 / 10:20 AM IST

Niharika Konidela Interesting Comments on Pawan Kalyan Son Akira Nandan Entry in Film Industry

Niharika – Akira : పవన్ తనయుడు అకిరా నందన్ ఇటీవల రెగ్యులర్ గా బయట కనిపిస్తూ వైరల్ అవుతున్నాడు. పవన్ సినిమాలకు థియేటర్స్ లో హడావిడి చేస్తున్నాడు. పవన్ ఎన్నికల్లో గెలిచాక నాన్నతో పాటే తిరిగాడు. అకిరా నందన్ హీరో అవుతాడని, సినిమాల్లోకి వస్తాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

గతంలో రేణు దేశాయ్ అకిరా హీరో అవ్వడు అని క్లారిటీ మాత్రం ఇచ్చింది. అకిరా ఆల్రెడీ ఒక షార్ట్ ఫిలింకి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం, మ్యూజిక్ నేర్చుకోవడానికి అమెరికా వెళ్లడం, పలుమార్లు తన మ్యూజిక్ ట్యాలెంట్ బయటపెట్టడంతో అకిరా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని భావిస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం అకిరాని హీరోగా చూడాలని అనుకుంటుండటంతో మెగా ఫ్యామిలీకి ప్రతిసారి అకిరా సినీ ఎంట్రీపై ప్రశ్నలు ఎదురు అవుతూనే ఉన్నాయి.

Also Read : Jabardasth New Judge : జబర్దస్త్‌కి కొత్త జడ్జి.. ఫస్ట్ ఎపిసోడ్ లోనే పంచులతో హవా..

తాజాగా నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు ఓటీటీ రిలీజ్ మీట్ పెట్టగా ఈ ప్రెస్ మీట్ లో నిహారికకు అకిరా గురించి ప్రశ్న ఎదురయింది. ఓ మీడియా ప్రతినిధి చాలా మంది కొత్తవాళ్లను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు, మీ తమ్ముడు అకిరాను పరిచయం చేసే ఉద్దేశం ఉందా అని అడగ్గా నిహారిక సమాధానమిస్తూ.. ఇంకా అతను చాలా యంగ్. అసలు అకిరాకి ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన ఉందా అని కూడా నేను ఎప్పుడూ అడగలేదు. అతను సినిమాల్లోకి వస్తాడో రాడో నాకు తెలీదు అని తెలిపింది.