Jabardasth New Judge : జబర్దస్త్‌కి కొత్త జడ్జి.. ఫస్ట్ ఎపిసోడ్ లోనే పంచులతో హవా..

తాజాగా జబర్దస్త్ కి కొత్త జడ్జి వచ్చారు.

Jabardasth New Judge : జబర్దస్త్‌కి కొత్త జడ్జి.. ఫస్ట్ ఎపిసోడ్ లోనే పంచులతో హవా..

Jabardasth Replace Krishna Bhagawan with New Judge Actor Shivaji Promo goes Viral

Updated On : September 11, 2024 / 9:09 AM IST

Jabardasth New Judge : తెలుగు టీవీ షోలలో కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులని మెప్పిస్తూ ఎన్నో ఏళ్లుగా దూసుకుపోతుంది జబర్దస్త్. జబర్దస్త్ లో ఎంతో మంది కమెడియన్స్, జడ్జీలు, యాంకర్లు వచ్చారు. రోజా – నాగబాబు వెళ్ళిపోయాక రెగ్యులర్ గా జడ్జీలు, యాంకర్లు మారుతూనే ఉన్నారు. ప్రస్తుతం జబర్దస్త్ వారానికి రెండు ఎపిసోడ్స్ గా కృష్ణ భగవాన్, కుష్బూ జడ్జీలుగా రష్మీ యాంకర్ గా నడుస్తుంది.

తాజాగా జబర్దస్త్ కి కొత్త జడ్జి వచ్చారు. కృష్ణ భగవాన్ ప్లేస్ లో నటుడు శివాజీ జబర్దస్త్ లోకి జడ్జిగా ఎంటర్ అయ్యారు. ఒకప్పుడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన శివాజీ బిగ్ బాస్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి నటుడిగా మారి మళ్ళీ బిజీ అయ్యాడు. సినిమాలు, సిరీస్ లతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఇప్పుడు జబర్దస్త్ లోకి జడ్జిగా ఎంట్రీ ఇచ్చాడు శివాజీ.

Also Read : Devara : ‘దేవర’ హైప్ అప్పుడే అవ్వలేదు.. ఆయుధ పూజ సాంగ్ వస్తే.. సినిమాపై లిరిసిస్ట్ ట్వీట్..

తాజాగా శివాజీ జబర్దస్త్ లోకి జడ్జిగా ఎంట్రీ ఇచ్చిన ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. మొదటి ఎపిసోడ్ లోనే శివాజీ స్కిట్స్ పై కామెడీ పంచ్ లతో మెప్పించాడు. దీంతో కొన్నాళ్ల పాటు శివాజీ జబర్దస్త్ తో ప్రేక్షకులను మెప్పిస్తాడు అని తెలుస్తుంది. ప్రస్తుతం శివాజీ, కుష్బూలు జబర్దస్త్ కి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. మీరు కూడా శివాజీ జడ్జిగా ఎంటర్ అయిన జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో చూసేయండి..