Devara : ‘దేవర’ హైప్ అప్పుడే అవ్వలేదు.. ఆయుధ పూజ సాంగ్ వస్తే.. సినిమాపై లిరిసిస్ట్ ట్వీట్..
ట్రైలర్ తో దేవరపై అంచనాలు మరిన్ని పెరిగాయి.

Lyricist Ramajogaiah Sastry Special Tweet on Devara Upcoming Song
Devara : ఎన్టీఆర్ దేవర ట్రైలర్ నిన్న రిలీజయింది. ట్రైలర్ చూస్తుంటే రెగ్యులర్ కథే అయినా విజువల్స్, యాక్షన్ సీన్స్ మాత్రం చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ట్రైలర్ తో దేవరపై అంచనాలు మరిన్ని పెరిగాయి. దీంతో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ హైప్ ని మరింత పెంచుతూ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేసారు.
Also Read : Brahmanandam : దుర్యోధనుడి పాత్రలో బ్రహ్మానందం.. డైలాగ్స్ అదరగొట్టారుగా.. వీడియో వైరల్..
రామజోగయ్య శాస్త్రి తన సోషల్ మీడియాలో దేవర ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. ఆనందం అప్పుడే అయిపోలేదయ్యా.. ఇప్పుడే మొదలు.. ఆయుధపూజ పాట వస్తే ఇంక పట్టలేం మిమ్మల్ని…ఆ.. అంటూ ట్వీట్ చేసారు. దీంతో ఆ ఆయుధ పూజ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అని మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఆ పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఆనందం అప్పుడే అయిపోలేదయ్యా
ఇప్పుడే మొదలు …ఆయుధపూజ పాట వస్తే
ఇంక పట్టలేం మిమ్మల్ని…ఆ ..🔥🔥🔥🔥— RamajogaiahSastry (@ramjowrites) September 10, 2024
ఇక దేవర పార్ట్ 1 సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.