Brahmanandam : దుర్యోధనుడి పాత్రలో బ్రహ్మానందం.. డైలాగ్స్ అదరగొట్టారుగా.. వీడియో వైరల్..

బ్రహ్మానందం కేవలం కమెడియన్ మాత్రమే కాదు ఎంతో గొప్ప నటుడు అని గతంలో పలు సినిమాలతో నిరూపించారు కూడా.

Brahmanandam : దుర్యోధనుడి పాత్రలో బ్రహ్మానందం.. డైలాగ్స్ అదరగొట్టారుగా.. వీడియో వైరల్..

Brahmanandam Plays Duryodhana Character Video goes Viral

Updated On : September 11, 2024 / 7:49 AM IST

Brahmanandam : ఎన్నో కామెడీ సినిమాలతో ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని నవ్విస్తూనే ఉన్నారు బ్రహ్మానందం. కానీ గత కొన్నాళ్లుగా ఆయన అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. కామెడీ మాత్రమే కాక మంచి పాత్రలు ఏవైనా ఉంటే సెలెక్ట్ చేసుకొని మరీ సినిమాలు చేస్తున్నారు. బ్రహ్మానందం ఇప్పుడు ‘ఉత్సవం’ అనే సినిమాతో రాబోతున్నారు. దిలీప్, రెజీనా జంటగా నటించిన ఉత్సవం సినిమా నాటకాల ఆధారిత కథగా తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, నాజర్, మధుబాల.. ఇలా చాలామంది సీనియర్ యాక్టర్స్ నటించారు.

Also Read : Rana Daggubati : షారుఖ్, కరణ్ జోహార్ కాళ్ళకు నమస్కరించిన రానా.. వీడియోలు వైరల్..

తాజాగా ఉత్సవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి సినిమా నటీనటులు వచ్చారు. బ్రహ్మానందం కూడా ఈవెంట్ కి హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్లో సినిమాలో బ్రహ్మానందం దుర్యోధనుడి వేషం వేసి డైలాగ్ చెప్పిన వీడియోని ప్లే చేసారు. దుర్యోధనుడిలా వేషం వేసుకున్న బ్రహ్మానందం డైలాగ్స్ తో అదరగొట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా బ్రహ్మానందం దుర్యోధనుడి పాత్రలో డైలాగ్స్ చెప్పిన వీడియో చూసేయండి..

బ్రహ్మానందం కేవలం కమెడియన్ మాత్రమే కాదు ఎంతో గొప్ప నటుడు అని గతంలో పలు సినిమాలతో నిరూపించారు కూడా. ఇటీవల నాటకాల ఆధారంగా తీసిన రంగమార్తాండ సినిమాలో కూడా బ్రహ్మానందం ఎమోషనల్ పాతరలో మెప్పించారు. ఇప్పుడు మరోసారి ఉత్సవం సినిమాలో నాటకాలు వేసే వ్యక్తిగా, దుర్యోధనుడి పాత్రలో అదరగొట్టబోతున్నారు. దీంతో బ్రహ్మానందం ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.