Rana Daggubati : షారుఖ్, కరణ్ జోహార్ కాళ్ళకు నమస్కరించిన రానా.. వీడియోలు వైరల్..

తాజాగా రానా చేసిన పని వైరల్ గా మారింది.

Rana Daggubati : షారుఖ్, కరణ్ జోహార్ కాళ్ళకు నమస్కరించిన రానా.. వీడియోలు వైరల్..

Rana Daggubati Take Blessings from Shah Rukh Khan and Karan Johar Videos goes Viral

Updated On : September 11, 2024 / 6:59 AM IST

Rana Daggubati : రానా దగ్గుబాటికి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని తెలిసిందే. బాలీవుడ్ యాక్టర్స్ తో, అక్కడి నిర్మాణ సంస్థలతో రానా రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడు. మన తెలుగు సినిమాలు బాలీవుడ్ లో ప్రమోట్ చేయాలంటే రానా ఉండాల్సిందే. తాజాగా రానా చేసిన పని వైరల్ గా మారింది.

నిన్న రాత్రి బాలీవుడ్ లో ఐఫా అవార్డ్స్ కు సంబంధించిన ఓ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ కి రానా హోస్ట్ చేయగా బాలీవుడ్ స్టార్స్ అంతా వచ్చారు. ఈ క్రమంలో స్టేజి మీదకు షారుఖ్, కరణ్ జోహార్ రాగా రానా షారుఖ్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తర్వాత కరణ్ జోహార్ కాళ్ళ మీద పడి కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం షారుఖ్ రానాని దగ్గరికి తీసుకొని హత్తుకొని ముద్దు పెట్టాడు.

Also Read : Devara : లాస్ట్ నలభై నిమిషాలు వేరే లెవల్.. బాలీవుడ్‌లో దేవరపై ఎన్టీఆర్ కామెంట్స్..

దీంతో ఈ వీడియోలు వైరల్ అవ్వగా రానా చేసిన పనిని పలువురు అభినందిస్తున్నారు. తనకంటే పెద్దవాళ్ళను గౌరవించాలని రానా అలా వారి కాళ్లకు దండం పెట్టాడు. బాలీవుడ్ లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా కనిపించవు. రానా మన సౌత్ స్టార్ కాబట్టి అలా ఆశీర్వాదం తీసుకోగానే షారుఖ్ తో పాటలు అక్కడి మీడియా కూడా ఆశ్చర్యపోయి రానాని పొగిడేస్తోంది.