Devara : లాస్ట్ నలభై నిమిషాలు వేరే లెవల్.. బాలీవుడ్‌లో దేవరపై ఎన్టీఆర్ కామెంట్స్..
ఎన్టీఆర్ దేవర సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

NTR Speech at Devara Trailer launch event in Mumbai
NTR Speech : ఎన్టీఆర్ దేవర సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ట్రైలర్ లోని విజువల్స్ కి షాక్ అవుతున్నారు. ట్రైలర్ తో దేవర సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ముంబైలో బాలీవుడ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, కొరటాల శివ, జాన్వీ కపూర్, కరణ్ జోహార్ వచ్చారు.
ఈ నేపథ్యంలో అక్కడి మీడియాతో కూడా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర లాస్ట్ నలభై నిముషాలు అదిరిపోతుంది. ప్రేక్షకులు ఆ యాక్షన్ విజువల్స్ చూడటానికి నేను ఎదురుచూస్తున్నాను. కొరటాల శివ ఓ రేంజ్ లో తీశారు ఆ విజువల్స్. ఆ షార్క్ షాట్ తీయడానికి ఒక రోజంతా పట్టింది. దానికి చాలా కష్టపడ్డాను అని తెలిపారు.
Mahesh Babu : మరో బిజినెస్‌లోకి అడుగుపెట్టిన మహేశ్ బాబు..
ఎన్టీఆర్ స్వయంగా దేవర చివరి నలభై నిముషాలు అదిరిపోతుంది, విజువల్స్ సూపర్ ఉంటాయి అని చెప్తుండటంతో అభిమానులు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు దేవర సినిమా చూస్తామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక దేవర పార్ట్ 1 సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రాబోతుంది.
The last 30-40 minutes gonna rock you all ❤️🔥🥵🐯@tarak9999 #JrNTR #Devara #DevaraTrailer #DevaraOnSep27th#JrNTR pic.twitter.com/PtvGcmrpKI
— Vipin Sharma journalist (@vipinsharmaind) September 10, 2024