Toxic Teaser: యష్ టాక్సిక్ టీజర్ వచ్చేసింది.. విజువల్స్, యాక్షన్ సీన్స్ మాత్రం పీక్స్ అసలు
యష్ టాక్సిక్ టీజర్(Toxic Teaser) రిలీజ్ అయ్యింది.
Yash Toxic teaser out now
Toxic Teaser: కన్నడ స్టార్ యష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఇంటర్నేషనల్ లెవల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. కేజీఎఫ్ లాంటి భారీ హిట్ తరువాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన వీడియోస్, పోస్టర్ భారీ హైప్ క్రియేట్ చేయగా తాజాగా మోస్ట్ అవైటెడ్ టాక్సిక్ టీజర్(Toxic Teaser) విడుదల చేశారు మేకర్స్. బోల్డ్, వైలెట్ అండ్ స్టైలీష్ కంటెంట్ తో వచ్చింది ఈ టీజర్. ఇక టీజర్ లో విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఇక యష్ లుక్ అయితే అరాచకం అనే చెప్పాలి. నేను నో చెప్పాను అంటే నో అంతే అని చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక ఈ సినిమా మార్చ్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Prabhas: నాకు ప్రేమిచాలని ఉంది.. ఆ అనుభూతి.. ఫస్ట్ టైం ప్రేమ గురించి చెప్పిన ప్రభాస్
