తండ్రి డెడ్ బాడీ ఇచ్చేందుకు మైనర్‌ను పది రోజులు వెయిట్ చేయించిన హాస్పిటల్ మేనేజ్మెంట్

కరోనా మహమ్మారి ప్రభావానికి అయిన వాళ్లకు మృతదేహాలు ఇవ్వడం కూడా క్లిష్టంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లో 16 సంవత్సరాల టీనేజర్ తన తండ్రి డెడ్ బాడీని ...

కరోనా మహమ్మారి ప్రభావానికి అయిన వాళ్లకు మృతదేహాలు ఇవ్వడం కూడా క్లిష్టంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లో 16 సంవత్సరాల టీనేజర్ తన తండ్రి డెడ్ బాడీని తీసుకునేందుకు మూడు రోజు సమయం పట్టింది. అలీఘర్ లోని దీన్ దయాళ్ హాస్పిటల్ లో కొవిడ్ అనుమానంతో వ్యక్తిని జాయిన్ చేశారు. కొవిడ్ అనుమానంతోనే చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీని కొడుకుకు అప్పజెప్పేందుకు హాస్పిటల్ మేనేజ్మెంట్ నిరాకరించింది. దానికి కారణం అతను మైనర్ కావడమే.

డాక్టర్ ను కలిసి డెడ్ బాడీ అడిగేందుకు అతని కుటుంబంలో ఇంకెవ్వరూ లేరని చెప్పినా పట్టించుకోలేదు. పలు మార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ యాజమాన్యం లక్ష్యపెట్టలేదు.

ఎట్టకేలకు పోలీసుల వరకూ విషయం చేరడంతో మైనర్ కు బాడీ అందింది. చీఫ్ మెడికల్ సూపరిండెంట్ పైనా ఆరోపణలు గుప్పుమన్నాయి. మైనర్ అయితే ముందుగా పోలీసులకు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదని ప్రశ్నించారు.

ఆ టీనేజర్ జరిగిన మొత్తాన్ని పోలీసులకు వివరించాడు. హాస్పిటల్ లో జాయిన్ చేసిన రెండ్రోజుల తర్వాత ఏప్రిల్ 23న తుది శ్వాస విడిచారు. ‘హాస్పిటల్ మేనేజ్మెంట్ ను తండ్రి అంత్యక్రియల కోసం డెడ్ బాడీ ఇప్పించాలని రిక్వెస్ట్ చేశాను. వాళ్లు సంరక్షకుణ్ని లేదా ఎవరైనా పెద్ద వాళ్లని తీసుకురావాలని చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు.

అంతేకాకుండా ఆ టీనేజర్ రెంట్ కట్టలేడని భావించి ఇంటి ఓనర్ కూడా ఇంట్లోంచి బయటకు పంపించేశాడు.

స్థానికుడైన వ్యక్తి మహేశ్ మిశ్రా అతణ్ని గుర్తించి కాపాడేంుదకు ప్రయత్నించారు. మృతుడు కార్మికుడిగా పనిచేసే వాడని తండ్రీకొడుకులు ఇద్దరూ తనకు తెలిసిన వారేనని చెప్పాడు. మిశ్రా పోలీసులను కలిసి డెడ్ బాడీ ఇప్పించాలని కోరాడు. ఎట్టకేలకు మే3న పది రోజుల తర్వాత ఆ మృతదేహాన్ని దక్కించుకోగలిగాడు.

ట్రెండింగ్ వార్తలు