Redmi Note 13 Pro Plus 5G : రెడ్‌మి నోట్ 13ప్రో ప్లస్ 5జీ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ వచ్చేసింది.. స్పెషిఫికేషన్లు, ధర ఎంతంటే?

రెడ్‌మి ప్రామాణిక నోట్ 13ప్రో ప్లస్ 12జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999కు అందిస్తుంది. ఈ ఫోన్ ఫ్యూజన్ బ్లాక్, ఫ్యూజన్ పర్పుల్, ఫ్యూజన్ వైట్ కలర్‌వేస్‌లలో లభిస్తుంది.

Redmi Note 13 Pro Plus 5G : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి సరికొత్త రెడ్‌మి నోట్ 13ప్రో ప్లస్ 5జీ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ మంగళవారం (ఏప్రిల్ 30) లాంచ్ అయింది. రెడ్‌మి నోట్ 13ప్రో ప్లస్ 5జీ ఎడిషన్‌ను అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఎఫ్ఏఎ) సహకారంతో షావోమీ తయారుచేసింది.

Read Also : Mahindra XUV 3XO : మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కంపాక్ట్ ఎస్‌యూవీ కారు.. ఫీచర్లు అదుర్స్, భారత్‌లో ధర ఎంతంటే?

బ్యాక్ ప్యానెల్‌లో బ్లూ, వైట్ షేడ్స్‌తో డ్యూయల్-టోన్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఏఎఫ్ఏ బ్రాండింగ్‌తో ప్రత్యేకమైన బాక్స్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమన్షిటీ 7200 అల్ట్రా ఎస్ఓసీపై రన్ అవుతుంది. 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

రెడ్‌మి నోట్ 13ప్రో ప్లస్ 5జీ ఎడిషన్ ధర ఎంతంటే? :
రెడ్‌మి నోట్ 13ప్రో ప్లస్ 5జీ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ 12జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999కు అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ పేమెంట్లపై 3వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. వాస్తవానికి రెడ్‌మి ఫోన్ ధర రూ. 37,999కు పొందవచ్చు. షావోమీ ఫోన్ ధర రూ. 3వేల ఎక్స్చేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.

ఈ కొత్త ఫోన్ మే 15 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, షావోమీ రిటైల్ స్టోర్లు, అధికారిక ఎంఐ వెబ్‌‌సైట్ (Mi.com)లో అందుబాటులో ఉంటుంది. రెడ్‌మి ప్రామాణిక నోట్ 13ప్రో ప్లస్ 12జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999కు అందిస్తుంది. ఈ ఫోన్ ఫ్యూజన్ బ్లాక్, ఫ్యూజన్ పర్పుల్, ఫ్యూజన్ వైట్ కలర్‌వేస్‌లలో లభిస్తుంది.

రెడ్‌మి నోట్ 13ప్రో ప్లస్ 5జీ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి నోట్ 13ప్రో ప్లస్ 5జీ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్‌ షావోమీ అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో చేతులు కలిపింది. భారత మార్కెట్లో షావోమీ పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఎడిషన్ వెనుక ప్యానెల్‌పై ‘10’ సంఖ్యను కలిగి ఉంది. ఈ సంఖ్య లియోనెల్ మెస్సీ ఐకానిక్ జెర్సీ నంబర్ 10కి కూడా సూచన కావచ్చు. ఏఎఫ్ఏ సూచించే వైట్ బ్యాక్ ప్యానెల్‌లో ఆఫ్ సెంటర్‌లో బ్లూ, వైట్ కలర్ షేడ్స్‌తో డ్యూయల్-టోన్ డిజైన్‌తో వస్తుంది.

రెడ్‌మి నోట్ 13ప్రో ప్లస్ 5జీ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ బ్యాక్ ప్యానెల్ ఎఎఫ్ఏ బ్రాండింగ్‌ను కలిగి ఉంది. రెడ్‌మి ఫోన్ దిగువన ‘Campeon Mundial 22’ టెక్స్ట్‌ను కలిగి ఉంది. ఏఎఫ్ఏ బ్రాండింగ్‌తో ప్రత్యేకమైన బాక్స్, అప్లియిన్సెస్ కలిగి ఉంది. ఏఎఫ్ఏ లోగోతో బ్లూ కలర్ ఛార్జింగ్ కేబుల్, అడాప్టర్‌ను కలిగి ఉంది. సిమ్ ఎజెక్టర్ ఫుట్‌బాల్ షేప్, ఏఎఫ్ఏ లోగోను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ వాల్‌పేపర్‌లు, ప్రత్యేక ఐకాన్లతో కస్టమైజ్ యూఐని అందిస్తుంది.

రెడ్‌మి నోట్ 13ప్రో ప్లస్ 5జీ ఫోన్ వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ ఇతర ఫీచర్ల మాదిరిగానే ప్రామాణిక రెడ్‌మి నోట్ 13ప్రో ప్లస్ ఫీచర్లతో వచ్చింది. 6.67-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో 1.5కె రిజల్యూషన్ (1,220×2,712 పిక్సెల్‌లు), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ఎస్ఓసీ ఉంది. 200ఎంపీ ప్రైమరీ కెమెరా, దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68 రేటింగ్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ ఉంది. ఈ 5జీ ఫోన్ 120డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది.

Read Also : Realme P1 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి పి1 ప్రో 5జీ ఫోన్ సేల్ మొదలైందోచ్.. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే!

ట్రెండింగ్ వార్తలు