Covid-19 Deaths India : ప్రపంచంలో ప్రతి 4 కరోనావైరస్ మరణాలలో భారత్‌లో ఒకటి

భారతదేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. రోజురోజుకీ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో వరుసగా మూడో రోజు COVID-19 కారణంగా 3,443 మరణాలు నమోదయ్యాయి.

Coronavirus Deaths India : భారతదేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. రోజురోజుకీ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఏప్రిల్ 29న రాత్రి 11 గంటల వరకు దేశంలో వరుసగా మూడో రోజు COVID-19 కారణంగా 3,443 మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్ 28 నాటికి వైరస్ కారణంగా ప్రపంచంలో ప్రతి నాలుగు మరణాలలో ఒకటిగా భారత్ నిలిచింది. తొలిసారిగా 3.8 లక్షల కరోనావైరస్ కేసులను అధిగమించింది. రోజుకు 3,86,795 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశంలోఇప్పటివరకు మొత్తం 1,87,55,126 కేసులు నమోదు కాగా.. 2,08,255 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 66,159 అంటువ్యాధులు, కేరళ (38,607),
ఉత్తర ప్రదేశ్ (35,156) ఉన్నాయి. మహారాష్ట్రలో 771 మంది మరణించారు. ఆ తరువాత ఢిల్లీ (395), ఉత్తర ప్రదేశ్ (298) కరోనాతో మరణించారు. ఈ గణాంకాలలో లడఖ్
నుంచి వచ్చిన కరోనా కేసులు ఉండగా ఎలాంటి మరణాలు లేవు. రోజువారీ గణాంకాల స్వతంత్ర అగ్రిగేటర్ covid19india.org డేటాలో వెల్లడైంది. ఏప్రిల్ 29న దేశంలో
కొత్త రికవరీలు 2,89,998గా నమోదయ్యాయి. మొత్తం రికవరీల సంఖ్య 1,53,72,243కు చేరుకుంది.

గత ఏడు రోజులలో భారతదేశం సగటు రోజువారీ మరణాలు 2,882కు పెరిగాయి. ప్రపంచంలోనే అత్యధికంగా భారత్ లోనే మరణాలు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన ఐదు దేశాలలో యుఎస్, బ్రెజిల్, మెక్సికో, ఇండియా, యుకెలో రికార్డు స్థాయిలో నమోదు కాగా.. భారతదేశంలో మాత్రమే రికార్డు స్థాయిలో మరణాలు పెరుగుతున్నాయి.

ఏప్రిల్ 29న ఉదయం 7 గంటలకు ముగిసిన 21.9 లక్షల షాట్లు అందాయి. దేశంలో రోజువారీ వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య వరుసగా రెండవ రోజు పడిపోయింది. అంతకుముందు 24 గంటల్లో నమోదైన దానికంటే 3.6 లక్షల మోతాదు తక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ 28న దాదాపు 17.7 లక్షల కరోనా టెస్టులను నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు