Maharashtra : ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై బ‌స్సులో చెల‌రేగిన మంట‌లు.. ప్ర‌మాద స‌మ‌యంలో 36 మంది ప్ర‌యాణికులు..

మహారాష్ట్రలోని ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం ఉద‌యం బ‌స్సు డ్రైవ‌ర్ అప్రమత్తతతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

మహారాష్ట్రలోని ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం ఉద‌యం బ‌స్సు డ్రైవ‌ర్ అప్రమత్తతతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఓ ప్రైవేటు ట్రావెల్ బ‌స్సు ముంబై నుంచి పూణే వెలుతోంది. శ‌నివారం ఉద‌యం 7.30 గంట‌ల స‌మ‌యంలో బ‌స్సు మావ‌ల్‌లోని అధే గ్రామ స‌మీపంలో ఉన్న స‌మ‌యంలో బ‌స్సు టైరు ఒక్క‌సారిగా పేలిపోయింది. ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి.

క్ష‌ణాల్లోనే మంట‌లు బ‌స్సు మొత్తం వ్యాపించాయి. బ‌స్సు డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించి రోడ్డు ప‌క్క‌కు బ‌స్సును నిలిపివేశాడు. ప్ర‌యాణికుల‌ను అప్ర‌మ‌త్తం చేశాడు. బ‌స్సులోని ప్ర‌యాణికులు వెంట‌నే బ‌స్సులోంచి కింద‌కు దిగేశారు. ఆ స‌మ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉన్నారు.

ఓటు వేసేందుకు వచ్చిన మహిళ ప్రాణాలు కాపాడిన డాక్టర్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజనులు

బస్సుకు మంట‌లు అంటుకున్నాయ‌న్న స‌మాచారం అందుకున్న వెంట‌నే ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్‌బి) పెట్రోలింగ్ బృందం, అగ్నిమాపక శాఖ సిబ్బంది, వడ్గావ్ మావల్ ట్రాఫిక్ పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు.

అయితే అప్ప‌టికే బ‌స్సు పూర్తిగా ద‌గ్థ‌మైంది. కాగా.. ఘ‌ట‌న ఎక్స్‌ప్రెస్‌వే గ్రామాల‌ను క‌లిపే వంతెన కింద జ‌ర‌గ‌డంతో పెద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే.. అదృష్ట వ‌శాత్తు ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం చోటు చేసుకోక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. ప్ర‌యాణికుల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు