Cm Nitish Kumar: అయ్యయ్యో.. మహిళ హిజాబ్ లాగిన ముఖ్యమంత్రి.. మరో వివాదంలో సీఎం నితీశ్ కుమార్..

అంతేకాదు సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళల పట్ల సంకీర్ణ ప్రభుత్వం (జేడీయూ, బీజేపీ) సంకీర్ణ వైఖరి ఏంటో ఈ ఘటనతో తేలిపోయిందని ఆర్జేడీ అధికార ప్రతినిధి అహ్మద్ అన్నారు.

Cm Nitish Kumar: అయ్యయ్యో.. మహిళ హిజాబ్ లాగిన ముఖ్యమంత్రి.. మరో వివాదంలో సీఎం నితీశ్ కుమార్..

Updated On : December 16, 2025 / 12:24 AM IST

Cm Nitish Kumar: బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పాట్నాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన చేసిన పని కాంట్రవర్సీ అయ్యింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఓ మహిళ హిజాబ్ ను లాగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతిపక్షాలు సీఎం నితీశ్ చర్యను తీవ్రంగా తప్పుపట్టాయి. ఇది ఆయన మానసిక స్థితి తెలియజేస్తుంది అంటూ కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు మండిపడుతున్నారు.

పాట్నాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వైద్యురాలికి ఆయుష్ సర్టిఫికెట్ ను సీఎం నితీశ్ తన చేతుల మీదుగా అందజేశారు. సర్టిఫికెట్ ను చేతికి ఇచ్చిన ఆయన.. సడెన్ గా మహిళ ముఖానికి ఉన్న హిజాబ్ ను కిందకు లాగారు. సీఎం చర్యతో ఆ మహిళ ఒక్కసారిగా బిత్తరపోయింది. సీఎం నితీశ్ చర్యను కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టింది.

ముఖ్యమంత్రి నితీశ్ కు పూర్తిగా మతి భ్రమించినట్లు ఉందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చేసే పనులేనా ఇవి అని సీరియస్ అవుతున్నారు అపోజిషన్ లీడర్లు. అంతేకాదు సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళల పట్ల సంకీర్ణ ప్రభుత్వం (జేడీయూ, బీజేపీ) వైఖరి ఏంటో ఈ ఘటనతో తేలిపోయిందని ఆర్జేడీ అధికార ప్రతినిధి అహ్మద్ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ నితీశ్ కుమార్ ఇలానే ఓ మహిళ మెడలో పూల దండం వేయడం వివాదాస్పదమైంది.

Also Read: Video: ఇదేందిది? మ్యాగీ ట్యాబ్లెట్టా? నిజమేనా?