Video: ఇదేందిది? మ్యాగీ ట్యాబ్లెట్టా? నిజమేనా? AI మాయా?

వేడి నీటిలో మాత్ర వేస్తే మ్యాగీ రెడీ అంటూ సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న వీడియోలు.. అసలు నిజం ఇదే..

Video: ఇదేందిది? మ్యాగీ ట్యాబ్లెట్టా? నిజమేనా? AI మాయా?

Updated On : December 14, 2025 / 1:27 PM IST

Video: ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్నో రకాల రీల్స్ లేదా ఫొటోలను పోస్ట్ చేస్తుంటారు. అప్పుడప్పుడు కొన్ని రీల్స్ విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఇలాగే, ఇప్పుడు ‘మ్యాగ్గి క్యాప్సూల్’ రీల్ బాగా వైరల్ అవుతోంది.

మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటే ఇప్పటికే ఈ ‘మ్యాగీ క్యాప్సూల్’ రీల్స్ చూసే ఉంటారు. ఆ క్లిప్స్‌లో చిన్న క్యాప్సూల్ ను వేడి నీటిలో వేస్తే, 30 సెకన్లలో మ్యాగీగా మారుతుంది. ఈ చిన్న మాత్రను వేడి నీటిలో వేస్తే వెంటనే నూడిల్స్ తయారవుతుందని ఆ వీడియోలో చెబుతున్నారు.

ఈ వైరల్ రీల్‌ను @adityasoni01 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశారు. ఈ క్లిప్‌కు రెండు రోజుల్లో 30 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

మరో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @mehaklalwaniartలో కూడా ఇలాగే ఒక వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో మహిళ ఈ కాప్సూల్‌ను ఆన్‌లైన్ గ్రోసరీ డెలివరీ యాప్ నుంచి కొన్నట్లు చెప్పింది.

Also Read: 2026లో విదేశీ టూర్‌కి వెళ్లాలనుకుంటున్నారా? పాత పర్యాటక ప్రదేశాలు చూసి బోర్‌ కొట్టిందా? అయితే వీటిని చూడండి..

ఆ వీడియోకు 6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆమె రీల్‌కు “వైరల్ మ్యాగీ క్యాప్సూల్” అని క్యాప్షన్ పెట్టింది. వీరు మాత్రమే కాదు, ఇతర యూజర్స్ కూడా ఇలాంటివి పోస్ట్ చేశారు, ఇవి వైరల్ అయ్యాయి.

మ్యాగీ కంపెనీ ఏమంది?
దీనిపై మ్యాగీ ఇండియా స్పష్టత ఇచ్చింది. “దయచేసి ఏప్రిల్ ఫూల్ డేని ఇతర నెలల్లో జరుపుకోకండి” అని చెప్పింది. అంటే ఆ వీడియోల్లో ఏ మాత్రమూ నిజం లేదని మ్యాగీ చెప్పేసింది.

ఈ వీడియోలపై యూజర్స్ స్పందిస్తూ.. నిజమా? కాదా? అని ప్రశ్నించారు. అయితే, ఈ వీడియోలు అన్నింటినీ ఏఐతో సృష్టించి పోస్ట్ చేస్తున్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.