Mamata Banerjee : మరోసారి గాయపడ్డ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. హెలికాప్టర్ ఎక్కుతుండగా..
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి గాయపడ్డారు. దుర్గాపూర్ లో హెలికాప్టర్ ఎక్కుతున్న సమయంలో ఆమె కిందపడ్డారు.
- Harish Thanniru
- Updated on- April 27, 2024 / 02:30 PM IST
Mamata Banerjee Bengal
Mamata Banerjee Injured : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి గాయపడ్డారు. దుర్గాపూర్ లో హెలికాప్టర్ ఎక్కుతున్న సమయంలో ఆమె కిందపడ్డారు. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మమతా బెనర్జీ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో శనివారం అసన్సోల్లో రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనాల్సి ఉంది. దుర్గాపూర్ నుంచి అసన్సోల్ కు మమత వెళ్తున్నారు. ఆ సమయంలో హెలికాప్టర్ ఎక్కుతుండగా ఆమె ఒక్కసారిగా జారిపడ్డారు. సెక్యూరిటీ గార్డు వెనుక నుంచి ఆమెను పట్టుకొని.. చైర్ లో కూర్చోబెట్టారు. సీఎం మమతా బెనర్జీ పెనుప్రమాదం నుంచి బయటపడ్డారని, అయితే, స్వల్ప గాయాలయ్యాయని అధికారిక వర్గాలు తెలిపాయి.
Also Read : CM Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తలకు తీవ్ర గాయం.. ఆస్పత్రిలో చికిత్స!
ఘటన అనంతరం ఆమె దుర్గాపూర్ నుంచి అసన్సోల్ కు బయలుదేరారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనున్నారు. గత కొద్దిరోజుల క్రితం మమత బెనర్జీ తలకు గాయమైంది. ఆమె ఇంటిలోని బాత్ రూంలో పడిపోవడంతో ఆమె తలకు గాయమైన విషయం తెలిసిందే.
