CM Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తలకు తీవ్ర గాయం.. ఆస్పత్రిలో చికిత్స!

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారు. గురువారం సాయంత్రం ఆమె ఇంట్లో జారిపడటంతో నుదిటిపై బలమైన గాయమైందని టీఎంసీ తెలిపింది.

CM Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తలకు తీవ్ర గాయం.. ఆస్పత్రిలో చికిత్స!

Mamata Banerjee's head injury happened due to accidental fall, claims brother

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తలకు తీవ్ర గాయమైంది. కాళీఘాట్‌లోని నివాసంలో మమతా బెనర్జీ జారిపడ్డారు. ఈ ఘటనలో నుదిటి నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ఆస్పత్రిలో చేరారు. 69 ఏళ్ల టీఎంసీ అధినేత ఒక కార్యక్రమానికి హాజరైన తర్వాత తిరిగి వచ్చారు. ఆ తర్వాత దక్షిణ కోల్‌కతాలోని తన ఇంటిలో పడిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. గాయపడిన మమతను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టు ఆమె సోదరుడు కార్తీక్ బెనర్జీ బెంగాలీ మీడియాకు వెల్లడించారు.

Read Also : Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పై హరీష్ శంకర్ కామెంట్స్..

టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టీఎంసీ అధినేత మమతా గాయంతో ఉన్న ఫొటోను పార్టీ అధికారిక ట్విట్టర్ (X) హ్యాండిల్ నుంచి రిలీజ్ చేసింది. మమతా త్వరగా కోలుకోవాలంటూ టీఎంసీ కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.

అందిన సమాచారం ప్రకారం.. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్‌ఎస్‌కెఎమ్ ఆసుపత్రిలోని వుడ్‌బర్న్ వార్డులో సీఎం మమతా చికిత్స పొందుతున్నారు. సీనియర్ వైద్యుల బృందం ఆమెకు చికిత్స చేస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

సీనియర్ టీఎంసీ నేత సుఖేందు శేఖర్ రే ప్రకారం.. పార్టీ ఉపాధ్యక్షుడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ అయిన జగదీప్ ధంఖర్ సీఎం ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి కూడా ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read Also : Petrol Diesel Prices : కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు, లీటర్‌పై ఎంత తగ్గిందంటే..