Petrol Diesel Prices : కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు, లీటర్‌పై ఎంత తగ్గిందంటే..
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఊరట లభించినట్లు అయ్యింది.

Petrol Diesel Prices
Petrol Diesel Prices : సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. లీటర్ కు 2 రూపాయల చొప్పున తగ్గించింది. కొత్త ధరలు రేపు (మార్చి 15) ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులకు కాస్త ఊరట లభించినట్లు అయ్యింది. అసలే ధర మోతతో విలవిలలాడిపోతున్న జనాలకు.. కేంద్రం నిర్ణయంతో కొంత రిలీఫ్ దక్కనుంది. కాగా, చమురు ధరలు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించారు. ఇది పూర్తిగా ఎన్నికల స్టంట్ అని మండిపడ్డాయి. ఓటర్లకు గాలం వేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విపక్ష నేతలు అంటున్నారు.