Narayana : ఉల్లిగడ్డ వ్యాపారులందరూ బీజేపీ మద్దతుదారులే.. కేంద్రమే కృత్రిమ కొరత సృష్టిస్తోంది : నారాయణ

ఇండియా కూటమి బలపడటం వల్ల బీజీపీని నిలవరించవచ్చని పేర్కొన్నారు. ఊహాగానాలను తాము నమ్మబోమని తెలిపారు.

CPI National Secretary Narayana

Narayana Comments Central Government : కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వమే ఉల్లిగడ్డ కృత్రిమ కొరత సృష్టిస్తోందని ఆరోపించారు. ఉల్లి వ్యాపారులు అందరూ బీజేపీ మద్దతుదారులేనని పేర్కొన్నారు. రేపటి నుంచి ఉల్లి గోదాంలపై దాడులు చేయాలని సీపీఐ శ్రేణులకు నారాయణ పిలుపునిచ్చారు. రూ.80, రూ.100 పెడితేనే ఉల్లి దొరుకుతుందని, లేదంటే దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఇండియా కూటమి బలపడటం వల్ల బీజీపీని నిలవరించవచ్చని పేర్కొన్నారు. ఊహాగానాలను తాము నమ్మబోమని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ను కొత్తగూడెం, బెల్లంపల్లి టికెట్లు కోరామని తెలిపారు. అయితే బెల్లంపల్లి కాకుండా చెన్నూరు తీసుకోమన్నారని వెల్లడించారు. సీపీఎం సీట్లపై చర్చ జరుగుతుందన్నారు. ఇంకా సీపీఎం సీట్లపై స్పష్టత రాలేదని చెప్పారు.

Kunamneni Sambasiva Rao : కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించకపోయినా మేం పాటిస్తాం : కూనంనేని

రేపో మాపో మిగతా అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటిస్తుందని తెలిపారు. వివేక్ కాంగ్రెస్ లో చేరడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. చెన్నూరులో సీపీఐ గెలుపుకు వివేక్ కృషి చేస్తారని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. అనుమానాలు, ఊహాగానాలతో పొత్తును చెడగొట్టుకోలేమని స్పష్టం చేశారు.

చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితం
చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమైందని పేర్కొన్నారు. న్యాయం బతికే ఉన్నందని చెప్పడానికే చంద్రబాబు బెయిల్ రావడమే నిదర్శనం అన్నారు. ఇది రాజకీయ కక్షగా అభివర్ణించారు. జైల్లో ఉండాల్సిన వాళ్లు బయట ఉన్నారని, బయట ఉండాల్సిన వాళ్లు జైలు లోపల ఉన్నారని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు