Son sang for dying mother: కొవిడ్‌తో చనిపోతున్న తల్లి కోసం వీడియో కాల్‌లో కొడుకు పాట

పాడుతుంటే అక్కడ నిల్చొని ఫోన్ పట్టుకున్నా. అతను తల్లిని చూస్తూ పాడుతూ ఉన్నాడు. నర్సులు అంతా అక్కడ నిల్చొని సైలెన్స్ అయిపోయారు.

Son sang for dying mother: కొవిడ్-19 సెకండ్ వేవ్ ఉధృతంగా మారి వయస్సుతో సంబంధం లేకుండా లక్షల్లో ప్రాణాలను బలిగొంటుంది. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ.. హృదయ విదారక దృశ్యాల్ని కళ్లకు చూపిస్తుంది. నెట్టింట్లో ఈ వీడియోలు చూస్తూ మనసు ద్రవించుకుపోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

రీసెంట్‌గా డా.దీప్షిఖా ఘోష్ అనే మహిళ చేసిన ట్వీట్ కు అమితమైన రెస్పాన్స్ వస్తుంది. మరణానికి దగ్గరైన తల్లిని చూసి కొడుకు పాటను పాడుతూ ఫేర్ వెల్ చెప్తున్న ఘటనను ఇలా వివరించింది.

‘తేరా ముజ్ సే హై పెహ్లే కా నాటా కోయి’ అని పాడుతుంటే అక్కడ నిల్చొని ఫోన్ పట్టుకున్నా. అతను తల్లిని చూస్తూ పాడుతూ ఉన్నాడు. నర్సులు అంతా అక్కడ నిల్చొని సైలెన్స్ అయిపోయారు. మధ్యలోనే బాధతో కిందపడిపోయాడు. అలాగే పాటను పూర్తి చేసి నాకు థ్యాంక్స్ చెప్పాడు’ అని ట్వీట్ చేశారు.

ఆ పాట విని అందరూ కన్నీళ్లు తెచ్చుకున్నారు. ఈ ట్వీట్ లో తల్లీకొడుకుల బంధంతో పాటు చావు అంచులకు వెళ్లినా కాపాడాలని ప్రయత్నం చేస్తున్న డాక్టర్ల సేవను కొనియాడుతున్నారు నెటిజన్లు.

ట్రెండింగ్ వార్తలు