Zerodha CEO Nithin Kamath : ఉద్యోగులు బరువు తగ్గితే రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించిన ‘జెరోధా’

ఉద్యోగులు బరువు తగ్గితే రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించింది జెరోధా కంపెనీ.

Zerodha CEO Nithin Kamath offers Rs 10 lakh reward : వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే తమ ఉద్యోగులకు ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోధా (Zerodha)ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలని ఆశించిన ‘జెరోధా’ సంస్థ సీఈవో నితిన్ కామత్ ( Nithin Kamath) ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. బరువు తగ్గితే రూ. 10 లక్షలు బహుమతిగా ఇస్తాం అంటూ అంటూ ప్రకటించారు నితిన్ కామత్. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు బరువు పెరిగి అనారోగ్యం బారినపడుతున్నట్టు పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో తమ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలని..ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురి కాకూడదని ఆశించిన సీఈవో నితిన్ ఈ చక్కటి ఆఫర్ ను ప్రకటించారు. తమ ఉద్యోగులకు ‘ఫిట్ నెస్ ఛాలెంజ్’విసిరారు. బరువు తగ్గించుకునే ఉద్యోగులకు రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు జెరోధా సీఈవో నితిన్ కామత్.

రోజుకు 350 కేలరీల కొవ్వును కరిగించుకున్న ఉద్యోగులకు వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. తమ ఫిట్‌నెస్ ట్రాకర్ పరికరాల్లో ఉద్యోగులు రోజువారీగా ఎంత కొవ్వును కరిగించాల్సి ఉంటుందన్న పరిధిని ఏర్పాటు చేస్తామన్నారు. నిర్దేశిత కాలపరిమితిలో లక్ష్యాన్ని చేరుకున్న వారికి నెల రోజుల వేతనాన్ని బోనస్‌గా అందిస్తామన్నారు. అలా బరువు తగ్గిన ఉద్యోగుల మధ్య లక్కీ డ్రా నిర్వహించి రూ.10 లక్షల బహుమతిని అందిస్తామని వివరించారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల గంటల తరబడి ఒకేచోట కూర్చోవటం వల్ల ఫిజికల్ ఎక్సర్ సైజ్ లేకపోవటం వల్ల చాలామంది బరువు పెరుగుతున్నారని..దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయని..తమ ఉద్యోగులకు ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలని తాను ఆశిస్తున్నానని అందుకే ఇటువంటి ‘ఫిట్ నెస్ ఛాలెంజ్’ అంటూ చెప్పుకొచ్చారు ‘జెరోధా’ సీఈవో నితిన్ కామత్. కామత్ ఆలోచన ప్రకారం ఉద్యోగులు 90 శాతం రోజుల్లో బరువు తగ్గాల్సి ఉంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు