భారత్‌లో ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆనంద్ మహీంద్ర

ఆ హైవే కింద నుంచి పులి రాజసాన్ని ప్రదర్శిస్తూ నడుచుకుంటూ వెళ్లిన ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ (పెంచ్ నేషనల్ పార్క్) వద్ద నిర్మించిన హైవే ఫొటోను మహీంద్రా అండ్ మహీంద్రా చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. ఈ హైవేను నిర్మించిన తీరు అద్భుతంగా ఉందని కొనియాడారు.

పెంచ్ టైగర్ రిజర్వ్ మీదుగా జాతీయ రహదారి 44లో భాగంగా దీన్ని నిర్మించారని తెలిపారు. వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించుకునేలా వాటికి రహదారి ఏ మాత్రం అడ్డురాని విధంగా దీన్ని నిర్మించారని చెప్పారు. హైవే కింద నుంచి వన్యప్రాణులు సంచరించవచ్చని తెలిపారు.

ఆ హైవే కింద నుంచి పులి రాజసాన్ని ప్రదర్శిస్తూ నడుచుకుంటూ వెళ్లిన ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్ర ఈ ఫొటోను షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఫొటోకు రెండున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. పోస్ట్‌కి ఏడు వేల కంటే ఎక్కువ మంది లైక్‌లు కొట్టారు.

చాలా అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆనంద్ మహీంద్ర తరుచూ ఇలాంటి ఆసక్తికర పోస్టులు చేస్తుంటారు. నెటిజన్లను తన పోస్టులతో అమితంగా ఆకట్టుకుంటారు.

Also Read: వేదికపై పాట పాడుతుండగా యువకుడు చేసిన పనికి షాకైన గాయని

ట్రెండింగ్ వార్తలు