Viral Video: వేదికపై పాట పాడుతుండగా యువకుడు చేసిన పనికి షాకైన గాయని

‘ఏం జరుగుతోంది? బాటిల్స్ విసిరితే జరిగేది ఏంటి? చెప్పండి.. ఈ షో ఆగిపోతుంది.. మీకు అదే కావాలా?’ అని అడిగింది.

Viral Video: వేదికపై పాట పాడుతుండగా యువకుడు చేసిన పనికి షాకైన గాయని

Sunidhi Chauhan

Updated On : May 5, 2024 / 2:48 PM IST

డెహ్రాడూన్‌లోని ఎస్జీఆర్ఆర్ యూనివర్సిటీలో నిర్వహించిన కన్సెర్ట్‌లో ఓ యువకుడు ఆకతాయి చర్యలకు పాల్పడ్డాడు. సింగర్ సునిధి చౌహాన్ వేదికపై పాట పాడుతుండగా ఆమెపైకి బాటిల్ విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ‘రిషబ్ భండారి అండ్ ఉత్తరాఖండి అఫీషియల్స్’ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. వేదికపై తాను పాటపాడుతున్న సమయంలో బాటిల్ వచ్చి పడడంతో సింగర్ సునిధి చౌహాన్ షాక్ అయింది. చేతులపై ఛాతిపై పెట్టుకుని శ్వాస పీల్చుకుంది. ‘ఏం జరుగుతోంది? బాటిల్స్ విసిరితే జరిగేది ఏంటి? చెప్పండి.. ఈ షో ఆగిపోతుంది.. మీకు అదే కావాలా?’ అని అడిగింది.

దీంతో ప్రేక్షకులు ‘నో’ అని అరిచారు. ప్రతి చోట ఆకతాయిలు ఉంటారని, జరిగే ప్రోగ్రాంను చెడగొట్టడానికే వాళ్లు వస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అటువంటి వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఎవరో తాగుబోతులు ఇలాంటి చర్యకు పాల్పడి ఉండవచ్చిన ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by ??????? ???????? | Dehradun (@rishabhuncutnews)


Also Read: అమెరికాలో మొదటిసారి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్..