Viral Video: ఎండల వేడిని తట్టుకోవడానికి ఈ మంకీ గ్యాంగ్ ఏం చేసిందో చూడండి..

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఎండల వేడిని తట్టుకోవడానికి ప్రజలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జ్యూసులు తాగడం, మధ్యాహ్నం సమయాల్లో ఇళ్లలోనే ఉండడం, ఏసీలు, కూలర్లు ఆన్ చేసి పెట్టుకోవడం వంటి వాటితో ఉపశమనం పొందుతున్నారు. మరి జంతువులు ఏం చేస్తాయి?

ఎండల వేడిని తట్టుకోవడానికి కొన్ని కోతులు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముంబైలోని బోరివాలి ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబై మార్చ్ అనే ఎక్స్ అకౌంట్లో ఈ వీడియోను షేర్ చేశారు.

మనుషుల్లానే అవి ఈత కొడుతుండడం, స్విమ్మింగ్ పూల్ లోకి డైవ్ చేయడం వంటి కోతుల చర్యలు ఆకర్షిస్తున్నాయి. ఈ కోతుల ఈతను చూశాక తనకు కూడా స్విమ్మింగ్ పూల్ కు వెళ్లాలన్న కోరిక పుడుతోందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కోతులకు ఈత ఎవరు నేర్పారని మరో నెటిజన్ సెటైర్ వేశాడు. కోతులు మనుషుల కన్నా ఎక్కువగా ఎంజాయ్ చేస్తాయని కొందరు కామెంట్లు చేశారు.

Also Read: భారత్‌లో ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆనంద్ మహీంద్ర

ట్రెండింగ్ వార్తలు