PM Modi Road Show : మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్‌షో.. పోలీస్ హై అలర్డ్.. కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ భద్రత!

PM Modi Road Show : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా శుక్రవారం (మార్చి 15) విజయ సంకల్ప రోడ్ షో ప్రారంభమైంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Hyderabad Police issues High Alert of Malkajgiri routes to avoid ahead of PM Modi’s roadshow today

PM Modi Road Show : తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లోని మల్కాజ్గిరిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మోదీ పర్యటనలో భాగంగా శుక్రవారం (మార్చి 15) విజయ సంకల్ప రోడ్ షో చేపట్టారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

అయితే, మల్కాజ్‎గిరిలో 1.5 కిలోమీటర్ వరకు దాదాపు గంట పాటు మోదీ రోడ్ షో కొనసాగనుంది. మోదీ రోడ్ షో కోసం రెండు వేలకు పైగా10 అంచెల పోలీస్ భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాదు.. మోదీ రోడ్డు షో రూట్ మ్యాప్‌ను ఎస్పీజీ కమాండో టీం తమ అధీనంలోకి తీసుకుంది.

Read Also : ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారుల సోదాలు

భారీకేట్లు ఏర్పాటు.. ఇరువైపుల షాపుల మూసివేత : 
ప్రధాని షాడో సెక్యూరిటీగా 60మందికి పైగా ఎస్‌పీజీ ఉన్నత కమాండోస్, మరో రెండు అంచెల 10 ప్లస్ ఎన్‌ఎస్‌జీ కమాండోస్ టీం రంగంలోకి దిగింది. ఈరోజు సాయంత్రం 5.40 గంటలకు స్టార్టింగ్ పాయింట్ మీర్జాలగూడ నుంచి మల్కాజ్‌గిరికి సాయంత్రం 6.40 నిమిషాలకు మోదీ రోడ్ షో ఎండ్ పాయింట్ చేరుకోనుంది. ఈ సమయంలో ప్రధాన రహదారులకు ఇరువైపులా భారీకేట్లు ఏర్పాటు చేశారు. మోదీ రోడ్ షో కొనసాగే మార్గంలోని ఇరువైపులా ఉన్న షాపులను మూసివేశారు.

సీసీ కెమెరాలతో భద్రత పర్యవేక్షణ :
ప్రధాని రోడ్ షోకు సంబంధించి ఇప్పటికే ఎస్పీజీ బృందం ట్రయల్ రన్ నిర్వహించింది. ఎస్పీజీ కమాండోస్‌తో సెంట్రల్ ఇంటెలిజెన్స్ సిటీ సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటలిజెన్స్ కేంద్ర బలగాల కోఆర్డినేషన్ చేస్తున్నాయి. 1.5 కిలోమీటర్ల వరకు సాగే మోదీ రోడ్ షో కోసం ఆయా మార్గాల్లో సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించనున్నారు.

ప్రారంభమైన రోడ్ షో.. ఓపెన్ టాప్ వాహనం ఎక్కిన మోదీ :
మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో ప్రారంభమైంది. ఓపెన్ టాప్ వాహనం ఎక్కి మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ పాటు వాహనంపైన కిషన్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.  మీర్జాలగూడ నుంచి మల్కాజ్‌గిరి చౌరస్తా వరకు మోదీ రోడ్ షో కొనసాగనుంది. రోడ్ షో ముగిసిన అనంతరం మల్కాజ్ గిరిలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రోడ్ షోలను నిర్వహిస్తుంది. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 5 కిలోమీటర్ల వరకు ప్రధాని రోడ్‌షో నిర్వహించనున్నారు. మల్కాజిగిరి రోడ్‌షో‌లో ఆయన పాల్గొంటారు. మీర్జాల్‌గూడ నుంచి మల్కాజ్‌గిరి క్రాస్‌ రోడ్‌ వరకు మోదీ రోడ్‌షో కొనసాగనుంది. అయితే, ఈ రాత్రికి రాజ్‌భవన్‌లోనే ప్రధాని మోదీ బస చేయనున్నారు. నాగర్‌కర్నూల్‌లో శనివారం (మార్చి 16న) పర్యటించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ కర్ణాటక బయల్దేరి వెళ్లనున్నారు.

Read Also : లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. రేవంత్ రెడ్డితో దానం నాగేందర్ భేటీ

ట్రెండింగ్ వార్తలు