MS Dhoni : విజ‌య్‌ ‘ది గోట్’ మూవీలో ఎంఎంస్‌ ధోని.. ఫ్యాన్స్ అరుపుల‌తో ద‌ద్ద‌రిల్లుతున్న థియేట‌ర్లు!

కోలీవుడ్ స్టార్ విజ‌య్ న‌టించిన మూవీ ది గోట్ (గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్‌ టైమ్‌).

MS Dhoni special appearance in Vijay THE Goat

MS Dhoni – Vijay : కోలీవుడ్ స్టార్ విజ‌య్ న‌టించిన మూవీ ది గోట్ (గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్‌ టైమ్‌). వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌద‌రి, మాళ‌విక శ‌ర్మ‌లు హీరోయిన్లుగా న‌టించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ మూవీలో ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ కీలక పాత్ర‌ల‌ను పోషించారు. ఇక ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా నేడు (సెప్టెంబ‌ర్ 5)న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో షోలు పూర్తి అయ్యాయి. సోష‌ల్ మీడియాలో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వ‌స్తోంది. ఇక ఈ మూవీలో హీరోలు అజిత్‌, శివ‌కార్తీకేయ‌న్ ల‌తో పాటు ఓ సీన్‌లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సైతం క‌నిపించాడ‌ట‌. ధోనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Double Ismart : సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడో తెలుసా..?

ఐపీఎల్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోని ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓ ఐపీఎల్ మ్యాచ్ సంద‌ర్భంగా ధోని పెవిలియ‌న్ నుంచి క్రీజులోకి వెలుతుండ‌గా.. ధోని పైకి చూస్తాడు. అప్పుడు స్టేడియం టాప్ పై విజ‌య్ బైక్ రైడ్ చేస్తూ క‌నిపించాడు. ఈ సీన్ వ‌చ్చిన‌ప్పుడు థియేట‌ర్ల‌లో ధోని, విజ‌య్ ఫ్యాన్స్ అరుపుల‌తో ద‌ద్ద‌రిల్లిపోయాయి. త‌లా.. త‌లా అంటూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోల‌ను ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు