Duleep Trophy : నేటి నుంచే దులీప్ ట్రోఫీ.. మ్యాచుల‌ను ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా..?

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన దులీప్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది.

Duleep trophy 2024 matchs live streaming details here

Duleep trophy 2024 : ప్ర‌తిష్టాత్మ‌క‌మైన దులీప్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. నేటి (సెప్టెంబ‌ర్ 5 గురువారం) నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు మినహా మిగిలిన టీమ్ఇండియా ఆట‌గాళ్లు అంద‌రూ ఈ టోర్నీలో ఆడుతుండ‌డంతో ప్ర‌స్తుతం అంద‌రి క‌ళ్లు ఈ టోర్నీపైనే ఉన్నాయి. నాలుగు జ‌ట్లు ఇండియా-ఏ, ఇండియా-బి, ఇండియా-సి, ఇండియా-డి అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెప్టెంబ‌ర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్‌లో చోటే ల‌క్ష్యంగా ఆట‌గాళ్లు ఈ టోర్నీలో బ‌రిలోకి దిగ‌నున్నారు.

టెస్టు జ‌ట్టులో ఉన్న ప్లేయ‌ర్లు త‌మ స్థానాల‌ను సుస్థిరం చేసుకోవాల‌ని భావిస్తుండ‌గా, మ‌రికొంద‌రు ఆట‌గాళ్లు టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉన్నారు. శుభ్‌మ‌న్ గిల్‌, మ‌యాంక్ అగ‌ర్వాల్‌, కేఎల్ రాహుల్, రిష‌బ్ పంత్ వంటి ఆట‌గాళ్లు బ‌రిలోకి దిగ‌నుండ‌డంతో మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగే అవ‌కాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతరపురం, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

AUS vs SCO : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప‌సికూన స్కాట్లాండ్ పై ఆసీస్ బ్యాట‌ర్ల పెను విధ్వంసం

మ్యాచుల‌ను ఎలా చూడొచ్చంటే..?
దులీప్ ట్రోఫీ మ్యాచుల‌ను టీవీలో స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఇక‌ ఓటీటీలో జియో సినిమాలో వీక్షించొచ్చు. ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. ఇక మ్యాచులు అన్నీ ఉద‌యం 9 గంట‌ల‌కు ఆరంభం కానున్నాయి.

షెడ్యూల్ ఇదే..
సెప్టెంబరు 5 – ఇండియా ఏ వ‌ర్సెస్‌ ఇండియా బి
సెప్టెంబరు 5 – ఇండియా సి వ‌ర్సెస్‌ ఇండియా డి
సెప్టెంబరు 12 – ఇండియా ఏ వ‌ర్సెస్‌ ఇండియా డి
సెప్టెంబరు 12 – ఇండియా బి వ‌ర్సెస్‌ ఇండియా సి
సెప్టెంబరు 19 – ఇండియా బి వ‌ర్సెస్‌ ఇండియా డి
సెప్టెంబరు 19 – ఇండియా ఏ వ‌ర్సెస్‌ ఇండియా సి

Rahul Dravid : రాజస్థాన్‌ రాయల్స్‌ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!

నాలుగు జ‌ట్ల వివ‌రాలు ఇవే.. ఏ జ‌ట్టులో ఎవ‌రు ఉన్నారంటే..?

ఇండియా ఏ : శుభ‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబె, తనుష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వాత్ కావెరప్ప , కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్.

ఇండియా బి : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తీ , జగదీషన్.

ఇండియా సి : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిషేక్ పోరెల్, సూర్యకుమార్ యాదవ్, ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు చౌహన్, మయాంక్ మార్కండే, ఆర్యన్, సందీప్ వారియర్.

ఇండియా డి : శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ, యశ్ దూబె, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, రికీ భుయ్, సరాన్ష్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సేన్‌గుప్తా, కేస్ భరత్, సౌరభ్ కుమార్.

ట్రెండింగ్ వార్తలు