Rahul Dravid : రాజస్థాన్ రాయల్స్ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చాలా కాలం తరువాత ఐపీఎల్‌లో అడుగుపెట్టనున్నాడు.
Rahul Dravid – IPL 2025 : టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చాలా కాలం తరువాత ఐపీఎల్‌లో అడుగుపెట్టనున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024తో టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ద్రవిడ్ తరువాత ఏం చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అతడు రాజస్థాన్ రాయల్స్ హెడ్‌కోచ్‌గా పనిచేయనున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన ఒప్పందం కూడా పూర్తి అయినట్లుగా ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ ఏడాది చివరల్లో మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలో ఆటగాళ్ల రిటెన్షన్ అంశం పై కూడా ద్రవిడ్‌తో ఫ్రాంచైజీ చర్చించినట్లుగా వెల్లడించింది. ఇక టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన విక్రమ్ రాథోడ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
Hardik Pandya : హార్దిక్ పాండ్యా ఇంటికొచ్చిన అగస్త్య.. కృనాల్ భార్య ఎంతపని చేసింది.?
గతంలో కూడా రాజస్థాన్ రాయల్స్‌తో ద్రవిడ్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ జట్టుకు కెప్టెన్‌గా, డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇక ఇప్పుడు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టినట్లయితే 2021 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తున్న కుమార సంగక్కర.. ఆర్ఆర్ కే చెందిన ఇతర లీగుల్లో పార్ల్ రాయల్స్(సౌతాఫ్రికా టీ20 లీగ్), బార్బోడస్ రాయల్స్(సీపీఎల్) జట్లకు అదే బాధ్యతను చేపట్టే అవకాశం ఉంది.