Hardik Pandya : హార్దిక్ పాండ్యా ఇంటికొచ్చిన అగస్త్య.. కృనాల్ భార్య ఎంతపని చేసింది.?
టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య, సెర్బియా మోడల్ నటాసా స్టాంకోవిచ్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Natasa Stankovic Drops Agastya At Hardik Pandyas Place Krunals Wife Shares Pic
Hardik Pandya – Agastya : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య, సెర్బియా మోడల్ నటాసా స్టాంకోవిచ్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2020లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2024 జూలైలో విడిపోయినట్లుగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. వీరికి నాలుగేళ్ల అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. తాము విడిపోయినా కూడా అగస్త్యకు తల్లిదండ్రులుగా మాత్రం కొనసాగుతామని ఆ సమయంలోనే చెప్పారు.
ఇక విడాకులు తీసుకున్న తరువాత అగస్త్యను తీసుకుని స్టాంకోవిచ్ సెర్బియాకు వెళ్లిపోయింది. అయితే.. తాజాగా అగస్త్యను ముంబైకి స్టాంకోవిచ్ తీసుకుని వచ్చిందని, తండ్రి హార్దిక్ పాండ్యా ఇంటి వద్ద అతడిని విడిచిపెట్టిందని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా భార్య పంకురి శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ఫోటో, వీడియోల ద్వారా ఈ విషయం తెలిసింది. తన కుమారుడు కవిర్‌తో కలిసి అగస్త్యకు కథలు చెప్తున్నానంటూ పాంఖురి రాసుకొచ్చింది.
Pakistan : పాకిస్థాన్‌కు మరో షాక్.. అసలే బంగ్లా చేతిలో ఓటమి బాధలో ఉంటే..?
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ 2024 ను భారత జట్టు గెలుచుకోవడంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడాడు. అయితే.. వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. పని భారం దృష్ట్యా ప్రస్తుతం హార్దిక్ వన్డేలు, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు.
టెస్టుల్లో ఆడడం లేదు. బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి టీమ్ఇండియా రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 6 నుంచి బంగ్లాతో టీ20 సిరీస్‌లో హార్ధిక్ ఆడే అవకాశం ఉంది. లంక పర్యటన తరువాత సుదీర్ఘ విరామం దొరకడంతో హార్దిక్ ప్రస్తుతం విహారయాత్రలో ఉన్నాడు.
PAK vs BAN : బంగ్లాదేశ్ పై సిరీస్ ఓటమి.. పాక్ కెప్టెన్ షాన్ మసూద్ కీలక వ్యాఖ్యలు..