PAK vs BAN : బంగ్లాదేశ్ పై సిరీస్ ఓటమి.. పాక్ కెప్టెన్ షాన్ మసూద్ కీలక వ్యాఖ్యలు..
పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ చరిత్రాత్మక విజయం సాధించింది.

Shan Masood disappointed with repeat mistakes after series loss
PAK vs BAN : పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది బంగ్లాదేశ్. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటి టెస్టులో బంగ్లా పది వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ఫార్మాట్‌లో పాక్‌పై బంగ్లాకు ఇదే తొలి సిరీస్ విజయం కావడం గమనార్హం. కాగా.. సిరీస్ ఓటమిపై పాక్ కెప్టెన్ షాన్ మసూద్ స్పందించాడు. ఈ ఓటమి తీవ్ర నిరాశపరిచిందని చెప్పుకొచ్చాడు.
రెండో టెస్టు మ్యాచులో ఓటమి అనంతరం షాన్ మసూద్ మాట్లాడుతూ.. ఈ ఓటమి తీవ్ర నిరాశపరిచిందన్నాడు. ఈ ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నాడు. హోం సీజన్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదరుచూశామని ఆస్ట్రేలియా తరహా కథనే పునరావృతమైందన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మెరుగైన క్రికెట్ ఆడాలని నేర్చుకున్నామని, అయితే.. సొంత గడ్డపై స్థాయికి తగ్గ క్రికెట్ ఆడలేకపోయామన్నాడు.
WTC Final : లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్.. ఏ రోజునంటే..?
ఈ విషయం పై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నాడు. తన కెప్టెన్సీలో ఇలా జరగడం నాలుగో సారి అని, సుధీర్ఘ ఫార్మాట్‌లో ఆటగాళ్లు మరింత ఫిట్‌గా ఉండడం ముఖ్యమన్నాడు. ఇక తొలి టెస్టులో నలుగురు పేసర్లతో బరిలోకి దిగడాన్ని మరోసారి సమర్థించుకున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ల్లో 274 పరుగులు మంచి స్కోరు. అయితే.. తొలి ఇన్నింగ్స్‌ల్లో 26 పరుగులకే 6 వికెట్లు తీసిన సమయంలో బంగ్లాదేశ్‌ను ఒత్తిడిలోకి నెట్టడంలో విఫలం అయినట్లు తెలిపాడు. లిటన్ దాస్ అద్భుతంగా ఆడాడని అన్నాడు.
మ్యాచ్ స్కోర్లు..
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్.. 274
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్.. 262
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ .. 172
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్.. 185/4