Harbhajan Singh : ఆ పని చేయలేకపోతే కోహ్లీ సిగ్గుపడాల్సిందే.. హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన పని లేదు.

Harbhajan Singh Recalls Virat Kohli Chat
Harbhajan Singh – Virat Kohli : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. అయితే.. కెరీర్ ఆరంభంలో అతడు కాస్త ఇబ్బంది పడ్డాడు. తనలోని నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ స్టార్ ఆటగాడిగా ఎదిగాడు. కెరీర్ ఆరంభంలో కోహ్లీ టీమ్ఇండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌తో కలిసి ఆడాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య చోటు చేసుకున్న ఓ సంభాషణను తాజాగా భజ్జీ వెల్లడించాడు.
2008లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా జరిగిన ఘటనను హర్భజన్ చెప్పాడు. అది శ్రీలంకతో వన్డే సిరీస్. ఆ సమయంలో అజంతా మెండీస్ చెలరేగి వరుసగా వికెట్లు తీస్తున్నాడు. అయితే.. కోహ్లీ మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తరువాత కోహ్లీ నా వద్దకు వచ్చి ఎలా ఆడాను అని అడిగాడు. బాగా ఆడావు అని చెప్పాను.
అప్పుడు అతడు నేను ఔట్ కాకుండా ఉండి మరిన్ని పరుగులు సాధించాల్సి ఉంది అని అన్నాడు. అతడి వైఖరి నాకు బాగా నచ్చింది అని భజ్జీ అన్నాడు.
2011లో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో కోహ్లీ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. అప్పుడు విండీస్ పేసర్ ఫిడెల్ ఎడ్వర్డ్స్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లీని ఔట్ చేశాడు. ముఖ్యంగా షార్ట్ బాల్ తో విరాట్‌ను బోల్తా కొట్టించాడు. దీంతో కోహ్లీ తీవ్ర నిరాశకు గురి అయ్యాడు.
Ravichandran Ashwin : రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్.. ధోని, కోహ్లీల కంటే అతడే బెస్ట్ కెప్టెన్!
అప్పుడు కోహ్లీతో.. నువ్వు టెస్టుల్లో 10వేల పరుగులు చేయకపోతే సిగ్గుపడాలి. నీకు పదివేల పరుగులు చేసే సత్తా ఉంది. నువ్వు చేయలేకపోతే అది నీ తప్పే అవుతుందని అతడితో చెప్పాను అని భజ్జీ గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 113 టెస్టులు ఆడాడు. 49.1 సగటుతో 8848 పరుగులు సాధించాడు. ఇందులో 29 శతకాలు, 30 అర్థశతకాలు ఉన్నాయి.