PAK vs BAN : చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. రెండో టెస్టులో పాక్‌పై ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్..
పాకిస్తాన్ గడ్డ పై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది.
PAK vs BAN : పాకిస్తాన్ గడ్డ పై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. తొలిసారి సిరీస్ కైవసం చేసుకుంది. రావల్పిండి వేదికగా పాక్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచులో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 185 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 56 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బంగ్లా బ్యాటర్లలో జాకీర్ హసన్ (40), నజ్ముల్ హుస్సేన్ శాంటో(38), మోమినుల్ హక్ (34) లు రాణించారు.
అంతకముందు ఓవర్‌నైట్ స్కోరు 42/0 తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జాకీర్ హసన్ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 9 పరుగులు మాత్రమే జోడించి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ 50 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. కొద్దిసేపటికే షాద్మాన్ ఇస్లాం (24) జట్టు స్కోరు 70 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.
Ravichandran Ashwin : రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్.. ధోని, కోహ్లీల కంటే అతడే బెస్ట్ కెప్టెన్!
ఈ దశలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో, మోమినుల్ హక్ లు కుదురుగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్ కు 57 పరుగులు జోడించి జట్టును గెలుపు దిశగా తీసుకువెళ్లారు. జట్టు స్కోరు 127 వద్ద నజ్ముల్ హుస్సేన్ శాంటో, 157 పరుగుల వద్ద మోమినుల్ హక్ పెవిలియన్‌కు చేరుకున్నారు. వీరిద్దరు ఔటైనా కానీ బంగ్లాదేశ్‌కు ఎలాంటి చింతా లేకుండా పోయింది. సీనియర్ ఆటగాళ్లు ముష్ఫికర్ రహీమ్ (22 నాటౌట్), షకీబ్ అల్ హసన్ (21 నాటౌట్) లు మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించారు.
మ్యాచ్ స్కోర్లు..
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్.. 274
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్.. 262
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ .. 172
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్.. 185/4
Mohammed Shami : రోహిత్, ద్రవిడ్‌లపై షమీ కౌంటర్లు.. మళ్లీ ఆ ఇద్దరికి ఆ ఆలోచన రాలేదు