Teachers Day 2024: సెప్టెంబర్ 5న ‘టీచర్స్ డే’ను ఎందుకు జరుపుకుంటామో తెలుసా?

మొదటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని 1962, సెప్టెంబర్ 5న

Teachers Day 2023

గురువు ప్రతి ఒక్కరి జీవితంలో అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానమనే వెలుగులు పూయిస్తాడు. శిష్యుడిలో నైపుణ్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి విజయానికి సరైన మార్గాన్ని చూపిస్తాడు. అలాంటి గురువుని జీవితాంతం గుర్తు పెట్టుకోవడం, వారికి కృతజ్ఞతలు చెప్పడం మన కర్తవ్యం. ఏటా సెప్టెంబర్ 5 ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అందరికీ ఆ అవకాశాన్ని ఇస్తుంది. సెప్టెంబర్ 5 న ప్రత్యేకంగా ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అంటే చదవండి.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. ఆయన గొప్ప పండితులు, భారతరత్న గ్రహీత, దేశ మొదటి ఉప రాష్ట్రపతి, స్వతంత్ర భారతదేశానికి రెండవ రాష్ట్రపతి. 1888, సెప్టెంబర్ 5న ఆయన జన్మించారు.

ఆయన గొప్ప విద్యావేత్త, న్యాయవాది అన్నింటికంటే గొప్ప ఉపాధ్యాయుడు. మొదటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని 1962, సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు జరుపుకున్నారు. అప్పటి నుంచి ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇలా జరుపుకోవడం వెనుక కారణం ఉంది.

డాక్టర్ రాధాకృష్ణన్ 1962లో భారత రాష్ట్రపతి అయ్యారు. సెప్టెంబర్ 5 న ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వమని ఆయన సన్నిహితులు, విద్యార్ధులు సంప్రదించారట. అప్పుడు ఆయన నా పుట్టినరోజుని జరపడం కంటే సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవంగా జరిపితే అది నాకు గర్వకారణం అన్నారట.’ ఆయన అభ్యర్ధనతో భారతదేశం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటోంది.

ఉపాధ్యాయులు ఏది మంచి ఏది చెడు బోధిస్తారు. విద్యార్ధులను భవిష్యత్ నాయకులుగా తీర్చి దిద్దుతారు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సవాళ్లు, కష్టాలు, సమాజంలోని వారి ప్రత్యేక పాత్రను గుర్తించడానికి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఈరోజున దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్ధులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తమ గురువులను సత్కరించుకుంటారు. ఈరోజున ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు భారత రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేస్తారు.

Also Read: హైదరాబాద్‌లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను అరెస్టు చేసిన మంగళగిరి పోలీసులు

ట్రెండింగ్ వార్తలు