Pakistan : పాకిస్థాన్‌కు మ‌రో షాక్‌.. అస‌లే బంగ్లా చేతిలో ఓట‌మి బాధ‌లో ఉంటే..?

పాకిస్థాన్ జ‌ట్టుకు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. ఆ జ‌ట్టుకు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి.

Pakistan slips to record low in ICC Test rankings after loss to Bangladesh

ICC Test Rankings : పాకిస్థాన్ జ‌ట్టుకు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. ఆ జ‌ట్టుకు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. అస‌లే స్వ‌దేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన పాకిస్థాన్‌కు మ‌రో షాక్ త‌గిలింది. బంగ్లాచేతిలో ఓడిపోవ‌డంతో ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) పాయింట్ల ప‌ట్టిక‌లో 8వ స్థానానికి పడిపోగా.. తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ ఆ జ‌ట్టు ర్యాంకు 8కి ప‌డిపోయింది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు పాక్ ఆరో స్థానంలో ఉండ‌డం గ‌మ‌నార్హం.

‘ఐసీసీ మెన్స్ టెస్టు ర్యాంకింగ్స్‌లో పాక్ 8వ స్థానానికి ప‌డిపోయింది. స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ ఓడిపోవ‌డంతో పాక్ పాయింట్లు త‌గ్గిపోయాయి. బంగ్లాతో సిరీస్‌కు ముందు పాక్ ఆరో స్థానంలో ఉండేది. వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో ఓడిపోవ‌డంతో ర్యాంకు ప‌డిపోయింది.’ అని ఐసీసీ తెలిపింది. ప్ర‌స్తుతం పాక్ ఖాతాలో 76 పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 124 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉంది. ఆ త‌రువాత భార‌త్ (120), ఇంగ్లాండ్ (108)లు ఉన్నాయి.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేశ్ ఫోగ‌ట్‌, బజరంగ్ పునియా.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ

బంగ్లా అదుర్స్‌..

లార్డ్స్ వేదికగా ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌-2 స్థానాల్లో నిలిచిన జ‌ట్లు ఫైన‌ల్‌లో డ‌బ్ల్యూటీసీ ట్రోఫీ కోసం పోటీప‌డ‌నున్నాయి. ఈ జాబితాలో విజ‌యాల శాతం ఆధారంగా డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం భార‌త్ (68.52) అగ్ర‌స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా (62.50) ఉంది.

మూడో స్థానంలో న్యూజిలాండ్ (50) కొన‌సాగుతోంది. ఇక పాక్ పై రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్ (45.83)తో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్ (45)లో ఉంది. ఇక పాక్ (19.05)తో ఎనిమిదో స్థానానికి ప‌డిపోయింది.

PAK vs BAN : బంగ్లాదేశ్ పై సిరీస్ ఓట‌మి.. పాక్ కెప్టెన్ షాన్ మ‌సూద్ కీల‌క వ్యాఖ్య‌లు..

ట్రెండింగ్ వార్తలు