Viral Pic: హృదయాన్ని ద్రవింపజేస్తున్న తండ్రీకూతుళ్ల స్టోరీ

అతడు తనతో పాటు తన రెండేళ్ల కుమార్తెను చూసుకుంటూ కష్టపడి..

తల్లిలేని బిడ్డను పెంచడానికి తండ్రులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఓ వైపు ఉద్యోగం చేసుకుంటూనే పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసే చోటుకి కూడా బిడ్డను తీసుకుపోతుంటారు కొందరు. ఇటువంటి తండ్రి కథనే ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లోని స్టార్‌బక్స్ అవుట్‌లెట్ మేనేజర్ దేవేంద్ర మెహ్రా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

జొమాటో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమార్తెను ఎత్తుకుని ఫుడ్ డెలివరీ చేస్తున్నాడని తెలిపారు. జొమాటో డెలివరీ పనిలో భాగంగా అతడు ఫుడ్ తీసుకెళ్లడానికి తమ స్టార్‌బక్స్ అవుట్‌లెట్లోకి వచ్చాడని, ఆ సమయంలో అతడితో పాటు అతడి బిడ్డను చూశామని చెప్పారు.

అతడి పాపకు ఉచితంగా బేబీకినో ఇచ్చామని అన్నారు. “ఇవాళ ఓ జొమాటో డెలివరీ బాయ్ మా స్టోర్‌కి ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాడు. అతను మా హృదయాన్ని గెలుచుకున్నాడు. అతడు తనతో పాటు తన రెండేళ్ల కుమార్తెను చూసుకుంటూ కష్టపడి పని చేస్తున్నాడు’’ అని మెహ్రా చెప్పారు.

అతడు తన కూతురి పట్ల చూపుతున్న ప్రేమ స్ఫూర్తివంతంగా ఉందని అన్నారు. అందుకే తాము ఆ పాపకు చిరు బహుమతిగా ఆమె ముఖంలో ఆనందం నింపే ప్రయత్నంలో బేబీకినో ఇచ్చామని తెలిపారు. ఆ డెలివరీ బాయ్ పేరు సోనూ అని చెప్పారు. దేవేంద్ర షేర్ చేసిన సోనూ, అతడి కుమార్తె ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Also Read: సెప్టెంబర్ 5న ‘టీచర్స్ డే’ను ఎందుకు జరుపుకుంటామో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు