Shubman Gill and Ananya Pandey's latest photos stir online buzz
టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్రాండ్ వాల్యూ క్రమంగా పెరుగుతోంది. భారత జట్టు భవిష్యత్తు సారథిగా అతడు ఎదుగుతుండడంతో అతడిని ప్రచారకర్తగా నియమించుకునేందుకు పలు కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ హెడ్‌ఫోన్స్ సంస్థ బీట్స్ గిల్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది.
దీని పై గిల్ స్పందిస్తూ.. ఆనందం వ్యక్తం చేశాడు. గ్రౌండ్‌లో తాను పరుగులు చేయడం ఎంత నిజమో.. బీట్స్ తమ కేటగిరిలో అగ్రస్థానంలో ఉన్నాయన్నాడు. బీట్స్ తీసుకొచ్చే ఉత్పత్తులను భారత్‌లో ఉపయోగించేందుకు ఉత్సాహంగా ఉన్నామని తెలిపాడు.
Hardik Pandya : హార్దిక్ పాండ్యా ఇంటికొచ్చిన అగస్త్య.. కృనాల్ భార్య ఎంతపని చేసింది.?
ఇదిలా ఉంటే.. గిల్‌తో పాటు బాలీవుడ్ నటి అనన్య పాండేను సైతం బీట్స్ తమ సంస్థకు అంబాసిడర్‌గా తీసుకుంది. బీట్స్ హెడ్ ఫోన్స్‌తో శుభ్‌మన్ గిల్, అనన్య పాండేలు దిగిన ఫోటోలు వైరల్‌గా మారాయి. అనన్య పాండేతో కలిసి గిల్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం పై స్పందిస్తూ మరోసారి టీమ్ఇండియా యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2024 సీజన్ అనంతరం రియాన్ పరాగ్.. ఆన్‌లైన్ గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ సెషన్‌లో పాల్గొన్నాడు. కాపీ లేని మ్యూజిక్ కంటెంట్‌ను వెతికే క్రమంలో యూట్యూబ్‌ను ఓపెన్ చేశాడు. అతడి సెర్చ్ హిస్టరీలో అనన్య పాండే, సారా అలీఖాన్ హాట్ అంటూ కనిపించింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. హీరోయిన్ల అందాల కోసం వెతికిన అతడు అప్పట్లోనే ట్రోలింగ్‌కు గురి అయ్యాడు. తాజాగా గిల్‌తో అనన్య ఫోటోలు వైరల్ కావడంతో ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నెటిజన్లు మరోసారి రియాన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
Pakistan : పాకిస్థాన్‌కు మరో షాక్.. అసలే బంగ్లా చేతిలో ఓటమి బాధలో ఉంటే..?
Justice for Riyan parag 💔 pic.twitter.com/8qwYGWi1WR
— narsa. (@rathor7_) September 4, 2024
ये क्या देख रहा हूँ मैं 👀🙄
Shubhman gill के साथ Riyan Parag की crush #AnanyaPanday 😍
Justice for indian cricketer #RiyanParag pic.twitter.com/B0UzRVRhyV
— 𝗞𝗼𝗵𝗹𝗶𝘀𝗺. (@Cheekutweets_) September 4, 2024