IND vs WI : వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ.. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలకు నో ప్లేస్..
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లలో పాల్గొనే భారత జట్లను (IND vs WI) బీసీసీఐ ప్రకటించింది.
India squads for home series against west indies T20s and ODIS
IND vs WI : స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లలో పాల్గొనే భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. గత కొంతకాలంగా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ వన్డే భవితవ్యం పై చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు.
వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ వైట్ బాల్ ఫార్మాట్లో మళ్లీ చోటు దక్కించుకుంటాడని భావించినప్పటికి అలా జరగలేదు. గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా ను ఎంపిక చేయలేదు. అలాగే జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్నారు.
సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. అదే విధంగా అక్టోబర్ 6 నుంచి 17 వరకు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
విండీస్‌తో వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, అకిబ్ నబి, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్
విండీస్‌తో టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఇదే..
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీశ్‌కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్
భారత్ వర్సెస్ వెస్టిండీస్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే – సెప్టెంబర్ 27న – తిరువనంతపురం (మధ్యాహ్నాం 2 గంటలకు)
* రెండో వన్డే – సెప్టెంబర్ 30న – గౌహతి (మధ్యాహ్నాం 2 గంటలకు)
* మూడో వన్డే – అక్టోబర్ 3న – న్యూ ఛండీగడ్ (మధ్యాహ్నాం 2 గంటలకు)
భారత్ వర్సెస్ వెస్టిండీస్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 మ్యాచ్ – అక్టోబర్ 6న – లక్నో (రాత్రి 7 గంటలకు)
* రెండో టీ20 మ్యాచ్ – అక్టోబర్ 9న – రాంచీ (రాత్రి 7 గంటలకు)
* మూడో టీ20 మ్యాచ్ – అక్టోబర్ 11న – ఇండోర్ (రాత్రి 7 గంటలకు)
* నాలుగో టీ20 మ్యాచ్ – అక్టోబర్ 14న – హైదరాబాద్ (రాత్రి 7 గంటలకు)
* ఐదో టీ20 మ్యాచ్ – అక్టోబర్ 17న – బెంగళూరు (రాత్రి 7 గంటలకు)
ఆసియా క్రీడల నుంచి వరుణ్ చక్రవర్తి ఔట్..
స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయంతో జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో విప్రాజ్ నిగమ్‌ను తీసుకున్నారు. మరోవైపు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయడంతో ఆసియా క్రీడల నుంచి నితీశ్ కుమార్ రెడ్డిని తప్పించారు.
ఆసియా క్రీడలకు అప్డేట్ చేసిన జట్టు ఇదే..
శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబె, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్
🚨 News 🚨#TeamIndia ODI & T20I squads announced for West Indies tour of India 2026, along with updated squad for Japan T20I & Asian Games.
More Details ▶️https://t.co/Lxx3Bz8Q14 pic.twitter.com/Y9RGlQ09XK
— BCCI (@BCCI) September 16, 2026
