Kamakshi Bhaskarla : ఫోటో కోసం ట్రెండ్.. జీవితం కోసం సౌకర్యం.. న్యూ స్టైల్ చీరలో పొరమేర బ్యూటీ.. కామాక్షి భాస్కర్ల ఫోటోలు వైరల్..
పొలిమేర ఫేమ్, నటి కామాక్షి భాస్కర్ల సోషల్ మీడియాలో న్యూ స్టైల్లో చీరకట్టులో ఉన్న ఫోటోలు పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. చీరను ఎన్నో రకాలుగా కట్టుకోవచ్చు, అలాగే ఆధునిక శైలిలో ప్రయోగాలు చేయడం ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. కానీ ఆ లుక్ ఎంత ట్రెండీగా ఉన్నప్పటికీ, సౌకర్యంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉండటమే అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఎందుకంటే కొన్నిసార్లు, మీరు ట్రెండ్‌ను అనుసరించాల్సిన అవసరం లేదు.. దాన్ని మీకు నచ్చినట్లుగా, మీకంటూ ఒక ప్రత్యేక శైలిలో ధరించడమే ముఖ్యం. ఫోటో కోసం ట్రెండ్... జీవితం కోసం సౌకర్యం. అంటూ రాసుకొచ్చింది.















