అధికారిక లాంఛ‌నాల‌తో రేపు డీఎస్ అంత్య‌క్రియ‌లు.. రాజకీయ ప్రముఖులు సంతాపం

డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Dharmapuri Srinivas passed away: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారు జామున 3గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో శ్రీనివాస్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డీఎస్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు సంతాపం తెలిపారు. అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీజీ వెంకటేశ్,  హరీశ్ రావు, ఏపీ మంత్రి నారా లోకేశ్ తో పాటు పలువురు డీఎస్ మృతిపట్ల సంతాపం తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Also Read : Dharmapuri Srinivas : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

డీ శ్రీనివాస్ పార్ధీవ దేహాన్ని హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో ఉంచారు. కడసారి చూసేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం నిజామాబాద్ ప్రగతినగర్ లోని నివాసానికి డీఎస్ పార్థీవ దేహాన్ని తరలిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో రేపు మధ్యాహ్నం నిజామాబాద్ లో డీఎస్ అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. డీఎస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సీఎస్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Also Read : Pawan Kalyan : తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

డి. శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్. ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. డీఎస్ మరణవార్త తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి డీఎస్ పార్దీవ దేహానికి నివాళులర్పించారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ఓదార్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. డి శ్రీనివాస్ తో కలిసి శాసనసభలో పనిచేసే అదృష్టం, నిరంతరం వారి ప్రోత్సాహం నాకు దక్కిందని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరితో డీఎస్ సన్నిహితంగా ఉండేవారు. యువత రాజకీయాల్లోకి రావాలని డీఎస్ ఎప్పుడూ చెబుతుండేవారు. 2004లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పోరాడిన వ్యక్తి డీఎస్ అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి డీఎస్ అని అన్నారు. డీఎస్ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read : CM Chandra babu : పింఛ‌న్‌దారుల‌కు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ.. కీలక విషయాలు వెల్లడి

డీఎస్ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో డీఎస్ తనదైన ముద్ర వేశారని, డీఎస్ ఎప్పుడూ హూందాడగా రాజకీయాలు చేసేవారని, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని చంద్రబాబు నాయుడు అన్నారు. డీఎస్ మృతిపట్ల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ గౌడ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, వి. హన్మంతరావుతో పాటు ఏపీ మంత్రి నారా లోకేశ్, పలువురు రాజకీయ ప్రముఖులు డీఎస్ మృతిపట్ల సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

ట్రెండింగ్ వార్తలు