అందుకే జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారారు: కేటీఆర్

KTR: రేవంత్ రెడ్డికి దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో..

సొంత ప్రయోజనాలు, డబ్బులు సంపాదించుకునేందుకే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారారని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో కేటీఆర్ మాట్లాడుతూ.. జగిత్యాలలో సంజయ్‌ను ఎమ్మెల్యేను చేసింది ఎవరని ప్రశ్నించారు. జగిత్యాలను జిల్లా చేసింది, వైద్య కళాశాలను తీసుకువచ్చింది కేసీఆరేనని అన్నారు.

జిల్లాను, వైద్య కళాశాలను రద్దు చేస్తామన్న పార్టీలో సంజయ్ చేరారని విమర్శించారు. గాలి వీస్తే గడ్డపారలు కొట్టుకుపోవని, గడ్డి పోచలే కొట్టుకుపోతాయని చెప్పారు. సంజయ్ కుమార్‌కి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటి చేయాలని సవాలు విసిరారు. అప్పట్లో తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అందరూ రాజ్యాంగబద్ధంగానే చేరారని చెప్పుకొచ్చారు.

ఎన్నో హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారంలోకి వచ్చారని చెప్పారు. ఆ హామీల నుండి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. తాము గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో వంతు సీట్లు గెలిచామని చెప్పారు. మరో14 చోట్ల స్వల్ప తేడాతోనే ఓడిపోయామని అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించాలని సవాలు విసిరారు.

Also Read: హిందూ సమాజం అంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మాత్రమే కాదు: రాహుల్ గాంధీ

ట్రెండింగ్ వార్తలు