Dragon Fruit Cultivation : డ్రాగన్ ఫ్రూట్ సాగుతో.. సత్ఫలితాలు సాధిస్తున్న యువరైతు

డ్రాగన్ ఫ్రూట్ మొక్కను ఒకసారి నాటితే 25, 30 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. అందుకే నేల తయారీ దగ్గరి నుంచి పోల్స్, సిమెంటు రింగులను ఏర్పాటు చేసుకునే వరకు నాణ్యతా ప్రమాణాలు పాటించారు. ఇక ఈ మొక్కలకు నీరు పెద్దగా అవసరం ఉండదు.

Dragon Fruit Cultivation

Dragon Fruit Cultivation : ఇటీవలికాలంలో తెలుగు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాల్లో విస్తరిస్తున్న కొత్త పంట  డ్రాగన్ ఫ్రూట్. ప్రపంచ దేశాల్లో విస్తృత గిరాకీ ఉన్న ఈ పంటకు మన వాతావరణం కూడా అనుకూలమని తేలటంతో రైతులు భారీఎత్తున ఈ పంటను విస్తరిస్తున్నారు. అయితే సాగు ప్రారంభంలో రైతులు ఎదుర్కున్న ఇబ్బందులు అనేకం. వీటన్నిటీని అధిగమించిన ఓ యువరైతు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు తిరుగులేదని నిరూపిస్తున్నారు.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో అధునిక సాంకేతి పరిజ్ఞానం వస్తోంది. వీటి వాడకానికి రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు . దీంతో పాటే, తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. వ్యాపార దృష్టితో వ్యవసాయం చేయకపోతే, మనుగడ కష్టంగా మారిన నేపధ్యంలో … సంప్రదాయ పంటలతోపాటు,  ఇతర దేశాల్లోఅధిక వాణిజ్య విలువ కలిగిన ఉద్యాన పంటలు, పండ్లతోటలను రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేసి, సత్ఫలితాలు నమోదు చేస్తున్నారు. ఈ కోవలోనే తెలుగు నేలపై కొత్తబంగారంగా కాంతులీనుతోంది డ్రాగన్ ఫ్రూట్. ఏలూరు జిల్లా, నూజివీడు మండలం, మీర్జాపురం గ్రామానికి చెందిన యువరైతు ఓలేటి సాయికిరణ్ మూడు ఎకరాల్లో సాయి హనుమాన్ డ్రాగన్ ఫామ్స్ పేరుతో డ్రాగన్ ఫ్రూట్ సాగుచేపట్టి సత్ఫలితాలను సాధిస్తున్నారు.

READ ALSO : Pests in Rice : వరిలో పెరిగిన పురుగులు, తెగుళ్ల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

రైతు సాయికిరణ్ స్వతహాగా కాంట్రాక్టర్. అయితే వ్యవసాయంపై ఉన్న మక్కువతో తనకున్న వ్యవసాయ భూమిలో 3 ఎకరాల్లో తైవాన్ పింక్, సియామ్రేడ్ రెడ్ రెండు రకాలను 2021 నవంబర్ లో నాటారు . ప్రస్తుతం రెండో పంట దిగుబడిని తీస్తున్నారు. నాటిన 7 వ నెల నుండి ఈ పంటలో పూత ప్రారంభమవుతుంది. మొదటి సంవత్సరం దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ, రెండవ ఏడాది నుండి దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. చల్లని వాతావరణంలో అంటే జూన్ నుండి నవంబరు వరకు పండ్ల దిగుబడి తీసుకోవచ్చు. ఈ ఏడాది తీవ్ర ఎండల వల్ల పంట దిగుబడి తగ్గిందని, అయితే సిఆమ్రేడ్ రకం మంచి ఫలితాలు అందిస్తోందని రైతు చెబుతున్నారు.

READ ALSO : Pests In Onion : ఉల్లిసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

డ్రాగన్ ఫ్రూట్ మొక్కను ఒకసారి నాటితే 25, 30 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. అందుకే నేల తయారీ దగ్గరి నుంచి పోల్స్, సిమెంటు రింగులను ఏర్పాటు చేసుకునే వరకు నాణ్యతా ప్రమాణాలు పాటించారు. ఇక ఈ మొక్కలకు నీరు పెద్దగా అవసరం ఉండదు. నేలలో తేమ ఉంటే చాలు. అయితే ఈ ప్రాంతంలో కరెంట్ అందుబాటులో లేకపోవడంతో సోలార్ ఏర్పాటు చేసుకొని తద్వారా నీటి తడులను అందిస్తున్నారు. అంతే కాదు రైతు ఎలాంటి రసాయనిక ఎరువుల వాడకం లేకుండా పూర్తి ప్రకృతి విధానంలోనే  సాగు చేస్తున్నారు. ఆవుల వ్యర్థాలతో సొంతంగా ఎరువు తయారు చేసుకుంటున్నారు.  ప్రకృతి ఎరువుల వల్ల కాయ నాణ్యత బాగుండటంతో పాటు నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది.  వచ్చిన దిగుబడిని అందరిలా అమ్మకుండా.. కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకొని మార్కెట్ లో పండ్లు లేని సమయంలో అమ్ముతూ..  మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

READ ALSO : Kharif Kandi Cultivation : ఖరీప్ కందిలో పురుగుల ఉధృతి.. నివారిస్తేనే అధిక దిగుబడులంటున్న శాస్త్రవేత్తలు

సేధ్యంపై ఆసక్తి వుంటే సరిపోదు. అనుకున్న లక్ష్యం చేరేవరకు దృఢసంకల్పంతో ముందడుగు వేయాలి. సాగులో సమస్యలను సైతం అధిగమించి డ్రాగన్ ఫ్రూట్ సాగులో విజయం సాధించిన సాయికిరణ్తి తోటి రైతులకు నిజంగా ఆదర్శనీయం .

ట్రెండింగ్ వార్తలు