Groundnut Bug And stem Fly : మినుము, పెసర పంటలో శనగపచ్చ పురుగు, కాండపు ఈగ నివారణ!

పెసర, మినుము పైర్లను వైరస్‌ తెగుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి నుండి సరైన జాగ్రత్తలు పాటిస్తే పంటను కాపాడుకోవటంతోపాటు మంచి దిగుబడులు పొందవచ్చు.

Groundnut Bug And stem Fly : నీటి పారుదల కింద ఆరుతడి పంటగా తేలిక భూముల్లో పెసర, మినుము పంటలను సాగు చేసుకోవచ్చు. తేమ బాగా నిలుపుకును భూముల్లో నీటి తడులు బాగా ఇచ్చే పరిస్థితి ఉంటే మినుము సాగు చేసి అధిక దిగుబడులు సాధించవచ్చు. పెసర, మినుము పైర్లను వైరస్‌ తెగుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి నుండి సరైన జాగ్రత్తలు పాటిస్తే పంటను కాపాడుకోవటంతోపాటు మంచి దిగుబడులు పొందవచ్చు. ముఖ్యంగా మినుము, పెసరను ఆశించే చీడపీడల్లో శనగపచ్చ పురుగు, కాండపు ఈగ బెడద అధికంగా ఉంటుంది. వాటి నివారణకు రైతులు తగిన జాగ్రత్తలు పాటించటం మంచిది.

శనగపచ్చ పురుగు: తల్లి పురుగు లేత చిగుళ్లపై, పూ మొగ్గలపై, లేత పిందెలపై విడివిడిగా లేత పసుపు రంగు గుడ్లని పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన వార పురుగులు మొగ్గల్ని గోకి తింటూ తరువాత దశలో మొగ్గల్ని తొలిచి కాయలోకి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయటుంచి లోపల గింజలను తిని డొల్ల చేస్తాయి. పురుగు తిన్న కాయకి గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి.

చిరు జల్లులు పడినప్పుడు, రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినప్పుడు మొగ్గ లేదా తొలి పూత దశలో 5 % వేప గింజల కషాయం లేదా వేప నూనె 5 మి.లీ. లేదా క్వినాల్ఫాస్‌ 25 % ఇ.సి. 2.0 మి.లీ. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడుబీ ఇండాక్సాకార్స్‌ 14.5 % యస్‌.సి 1.0 మి.లీ. లేదా స్పెనోశాడ్‌ 45 % యస్‌.సి 0.3 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 18.5 % ఎస్‌.సి. 0.3 మి.లీ. లేదా ప్లూబెండమైడ్‌ 39.35 % యస్‌.సి 0.2 మి.లీ./లీ . లేదా లామా సైహలోత్రిన్‌ 5 % ఇ.సి 1 మి.లీ./లీ. బ్యాసిల్లస్‌ తురింజెన్సిస్‌ 300 గ్రా. / ఎకరాకు. హెలికోవెర్పా %చీూప% ఏ 100-200 మి.లీ./ఎకరాకు, బెవేరియా బసియానా 1200 గ్రా./ ఎకరాకు పిచికారి చేసుకోవాలి.

కాండపు ఈగ : ఇది మినుములో ఎక్కువగా ఆశిస్తుంది. పిల్ల పురుగులు భూమికి దగ్గరగా ఉన్న కాండం మొదలు లోపలికి వెళ్లి లోపల కణజాలాన్ని తిని డొల్లగా మారుస్తాయి. పురుగు ప్రవేశించిన ప్రాంతం ఉబ్బి మొక్క ప్రక్కకు వాలిపోతుంది. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు చనిపోతాయి. కాండం చీల్చి చూసినప్పుడు పిల్లపురుగులు కనిపిస్తాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్‌ 36 % యస్‌.ఎల్‌ 1.6 లేదా ఎసిఫేట్‌ 75 % యస్పి 1.0 గ్రా. లేదా డైమిథోయేట్‌ 30 % ఇ.సి. 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయటం ద్వారా కాండపు ఈగ ఉధృతిని తగ్గించ వచ్చు.

ట్రెండింగ్ వార్తలు