Kurnool Medical College: క‌ర్నూలు మెడిక‌ల్ కాలేజీలో విద్యార్ధులకు కరోనా

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా మళ్లీ విజృంభించడం స్టార్ట్ చేసింది.

Kurnool Medical College: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా మళ్లీ విజృంభించడం స్టార్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ప్రభావం కనిపిస్తుండగా.. ఆంధ్రరాష్ట్రంలో కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో 15మందికి కరోనా సోకింది.

క‌ర్నూలోని మెడిక‌ల్ కాలేజీలోని మొత్తం 50 మంది వైద్య విద్యార్థుల‌కు క‌రోనా పరీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఎంబీబీఎస్ ఫ‌స్టీయ‌ర్ చ‌దువుతున్న 11మంది విద్యార్థుల‌కు, న‌లుగురు హౌస్‌స‌ర్జ‌న్‌ల‌కు క‌రోనా పాజిటివ్ వచ్చింది.

మరికొంత మంది విద్యార్ధులకు.. వారి కాంటాక్ట్‌లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్‌ను సేక‌రించి ల్యాబ్‌కు పంపించారు. మెడిక‌ల్ కాలేజీలోని విద్యార్థుల‌కు క‌రోనా సోక‌డంతో ఒక్కసారిగా కాలేజీలో కలకలం రేగింది. అప్రమత్తమైన అధికారులు పాజిటివ్‌ వచ్చిన వారిని ఐసోలేష‌న్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 1,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,78,964కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,774 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు