Andrapradesh : గురుకుల పాఠశాల హాస్టల్ లో పాముకాటుకు గురైన విద్యార్ధులు

విజయనగరం జిల్లా కురపాంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలుర గురుకుల విద్యాలయం హాస్టల్ లో నిద్రపోతున్న విద్యార్థులను పాము కాటు వేసింది.

3 students injured bitten by snake in mahatma jyotiba phule gurukul : గురుకుల పాఠశాలలో పాము కలకలం రేపింది.ఏపీలోని విజయనగరం జిల్లా కురపాంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలుర గురుకుల విద్యాలయం హాస్టల్ లో నిద్రపోతున్న విద్యార్థులను పాము కాటు వేసింది. ఈ ఘటనతో  తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఎటునుంచి ఏ విషపు పురుగు వస్తుందోనని హడలిపోతున్నారు విద్యార్ధులు. పాఠశాలకు సంబంధించిన హాస్టల్‌లో విద్యార్థులు నిద్రిస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

విద్యార్దులు పాము కాటుకు గురి అయిన విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది పాము కాటుకు గురైన ముగ్గురు విద్యార్థులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా ఈ ముగ్గురు విద్యార్ధుల్లో ఓ విద్యార్థి మృతి చెందినట్లుగా సమాచారం.మిగిలిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో హాస్టల్ రూమ్ లో నిద్రిస్తున్న విద్యార్థులను పాము కాటువేసింది. ఈ విషయం గుర్తించిన సిబ్బంది హుటాహుటిన పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు మరణించినట్లుగా తెలుస్తోంది. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా సమాచారం.

పాము కాటుకు గురైన ముగ్గురు విద్యార్థులు ఎనిమిదో తరగతికి చెందిన మంతిని రంజిత్, ఈదుబుల్లి వంశీ, వంగపండు నవీన్‌గా అధికారులు గుర్తించారు. వీరిలో చికిత్స పొందుతూ రంజిత్ మృతిచెందారని మిగతా ఇద్దరూ చికిత్స పొందుతున్నారు కానీ వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు