Badwel By-Election : బద్వేల్ ఉప ఎన్నికల్లో అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేతలు

కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఏపీ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని తెలిపారు.

BJP leaders complained EC : కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఏపీ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని తెలిపారు. వేరే పార్టీకి ఓటు వేస్తే ఊరుకోమని అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ క్షీణించిందని జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఉప ఎన్నికలకు కేంద్ర బలగాలు పెట్టాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూతులోనూ సీసీ కెమెరాలు పెట్టాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షణ చేయవలసిన ప్రభుత్యం భగ్నం చేస్తోందని సత్యకుమార్ విమర్శించారు.

YCP : ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం

బద్వేల్ ఉప ఎన్నికలకు కేంద్ర బలగాలు కేటాయించాలని కోరారు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించిన మంత్రిని బద్వేల్ కు ఇంఛార్జిగా నియమించారని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డిని బద్వేల్ లో అడుగుపెట్టకుండా ఈసి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

వైఎస్ఆర్సీపీ నాయకులు గుండాల్లాగా ప్రవర్తిస్తూ రౌడీయిజం చేస్తున్నారని సునీల్ దేవధర్ విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థను ఉప ఎన్నికలకు పక్కన పెట్టాలన్నారు. వైఎస్ఆర్సీపి చర్యలతో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందన్నారు.

ట్రెండింగ్ వార్తలు