Vishnu Vardhan Reddy : ఏపీలో జనసేన-బీజేపీ ప్రభుత్వం రాబోతోంది, ఇక జగన్‌పై సమరమే- బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Vishnu Vardhan Reddy : జగన్ మాటలకు, చేతలకు పొంతన లేదు. రాబోయే‌ 9 నెలల్లో ప్రజా ఉద్యమాలు చేయబోతున్నాం. బీజేపీ-జనసేన మైత్రిపై తప్పుడు..

Vishnu Vardhan Reddy(Photo : Twitter, Google)

Vishnu Vardhan Reddy – Pawan Kalyan : ఏపీలో రాజకీయం వేడెక్కింది. నాయకులు మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుపై ధీమాగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది మా ప్రభుత్వమే అని ఎవరికి వారు జోస్యాలు చెప్పుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని, అధికారంలోకి వస్తామని విశ్వాసంగా చెబుతున్నారు.

తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జనసేనతో మైత్రి, ఎన్నికల్లో పోటీపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో జనసేన-బీజేపీ అధికారంలోకి రాబోతోందని విష్ణువర్దన్ రెడ్డి చెప్పారు.

Also Read..YCP: వైసీపీలో వారసుల సందడి.. తలలు పట్టుకుంటున్న వైసీపీ పెద్దలు..!

విజయవాడలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. ”2024 ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనేలా‌ సమావేశంలో చర్చించాం. ఉద్యమాలు, పార్టీ బలోపేతం, ఇతర అంశాలపై డిస్కస్ చేశాము. ప్రజాక్షేత్రంలో వైసీపీ పాలనపై ప్రజా చార్జిషీట్ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించాం. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను 90శాతం విస్మరించింది.

పురంధేశ్వరి రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పర్యటిస్తారు. 23న రాయలసీమ, 25న కోస్తాంధ్ర, 26న రాజమండ్రి, 27న విశాఖలో ముఖ్యనేతల సమావేశంలో పురంధేశ్వరి పాల్గొంటారు. ఏపీలో ఇసుక విధానంపై ఒకే సంస్ధకు కేటాయించడం మానవవనరులను హరించడమేనని ఎన్జీటీ చెప్పింది. టిడ్కో ఇళ్లలో మిగులు భూమైన 260 ఎకరాల భూమిని గుర్తించి 750 కోట్ల నిధులు సేకరించేందుకు వైసీపీ ప్రభుత్వం యత్నించడం దుర్మార్గం. భూములను అమ్మే ప్రక్రియను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి.

Also Read..Pilli Subhash Chandra Bose: పిల్లి సుభాశ్‌చంద్రబోస్ వైఖరిలో మార్పు ఎందుకొచ్చింది.. అసంతృప్తిగా ఉన్నారా?

మూడు దశల్లో మద్యపాన నిషేధం ఎక్కడ? పేదల సొమ్ముతో వారి రక్తాన్ని తాగుతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం మ్యానిఫెస్టోలోని 900 అంశాలపై ప్రజలను మోసం చేసిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్తాం. మేనిఫెస్టోలో పెట్టిన రైతుల హామీ ధరల స్ధిరీకరణ ఏది? జగన్ మాటలకు, చేతలకు పొంతన లేదు. రాబోయే‌ 9 నెలల్లో ప్రజా ఉద్యమాలు చేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలను గుర్తించి సమస్యలపై యాక్షన్ ప్లాన్ రూపొందించబోతున్నాం. బీజేపీపై దుష్ప్రచారాన్ని చెరిపేసే విధంగా ప్లాన్ రూపొందిస్తున్నాం.

బీజేపీ-పవన్ కు సంబంధం లేదని ప్రచారం చేశారు. 18న ఎన్డీయే సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. బీజేపీ-జనసేన మైత్రిపై తప్పుడు ప్రచారం చేసిన వారికి ఈ పిలుపు ఒక కనువిప్పు. రాబోయే ఎన్నికల్లో జనసేన-బీజేపీ అధికారంలోకి రాబోతున్నాం” అని విష్ణువర్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు