Challa Babu : పుంగనూరు అల్లర్ల కేసు.. పోలీసులకు లొంగిపోయిన చల్లా బాబుతోపాటు టీడీపీ నేతలు

చంద్రబాబు పుంగనూరు పర్యటనలో ఏడు కేసుల్లో చల్లా బాబు ముద్దాయిగా ఉన్నారు. నాలుగు కేసులలో చల్లా బాబుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మూడు కేసులలో బెయిల్ నిరాకరించింది.

Challa Babu surrender police

Challa Babu Surrender Police : చిత్తూరు జిల్లా పుంగనూరు టీడీపీ ఇన్ చార్జీ చల్లా బాబు పోలీసులకు లొంగిపోయారు. చల్లా బాబుతోపాటు మరి కొంతమంది టీడీపీ నేతలు పోలీసులకు లొంగిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా పుంగనూరులో జరిగిన అల్లర్ల కేసులో చల్లా బాబు నిందితుడుగా ఉన్నాడు. చల్లా బాబు లొంగిపోవడానికి వచ్చిన సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసుల మోహరించారు. దీంతో జిల్లా పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది.

చంద్రబాబు పుంగనూరు పర్యటనలో ఏడు కేసుల్లో చల్లా బాబు ముద్దాయిగా ఉన్నారు. నాలుగు కేసులలో చల్లా బాబుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మూడు కేసులలో బెయిల్ నిరాకరించింది. ఈ మేరకు చల్లా బాబు మీడియాతో మాట్లాడారు. తప్పంతా వైసీపీ నేతలు చేసి నింద తమపై మోపారని తెలిపారు. చంద్రబాబు పుంగనూరులోకి రాకుండా అడ్డుకోవాలని చూశారని పేర్కొన్నారు.

Posani Krishna Murali : లోకేశ్ వల్ల నాకు ప్రాణహాని ఉంది, నేను చనిపోతే నా చావుకు ఆ కుటుంబమే కారణం- పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు

పోలీసులపై తమకు ఎలాంటి కోపం లేదన్నారు. తాము పోలీసులపై దాడి చేయలేదని చెప్పారు. వందలాది మందిపై కేసులు మోపి వారి కుటుంబాలను తీవ్ర ఇబ్బందుల పాలు చేశారని తెలిపారు. కార్యకర్తల కోసమే తాను లొంగిపోతున్నానని చెప్పారు. న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు