Chandrababu Warning : వచ్చేది నేనే.. తప్పుడు అధికారులను వదలను- చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

సీబీసీఐడీ చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని చంద్రబాబు ఫైర్ అయ్యారు. కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్ చేసేంత వరకు సీఐడీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

Chandrababu Warning : టీడీపీ కార్యకర్తల అరెస్టులపై చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తానేనని, తప్పుడు అధికారులను వదిలేది లేదని చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీబీ సీఐడీ చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని చంద్రబాబు ఫైర్ అయ్యారు. సుప్రీం నిబంధనలను కూడా పట్టించుకోకుండా సీబీసీఐడీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్ చేసేంత వరకు సీఐడీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఎంపీ రఘురామకృష్ణ రాజు విషయంలో ప్రభుత్వం ఎన్నో విమర్శలు ఎదుర్కొందని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఉంటే అప్పుడే రాజీనామా చేసి వెళ్లిపోవాల్సిందన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు సీరియస్ అయ్యారు.

Kollu Ravindra : మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు

కొంతమంది టెయినెటెడ్ ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన వెంకటేష్, సాంబశివరావు వంటి వారి విషయంలో వ్యవహరించిన తీరు అమానుషం అన్నారు చంద్రబాబు. మళ్లీ అధికారంలోకి రాబోయే పార్టీ టీడీపీనే అని గుర్తుంచుకోవాలన్న చంద్రబాబు.. తప్పుడు అధికారులను వదిలి పెట్టనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

”పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మాదే. కార్యకర్తలనే కాదు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని మాకు చేతనైనంత వరకు ఆదుకుంటాం. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నారాయణ మా పార్టీ కాదు. అయినా ఆ కుటుంబానికి మేం అండగా నిలిచాం. వాస్తవాలేమైనా ఉంటే అందరూ మాట్లాడతారు. జగన్ గురించే కాదు.. నా గురించీ మాట్లాడతారు సమాధానం చెప్పాలి.

AP : ప్రభుత్వ దుకాణాల్లో ఆ బ్రాండ్లు ఇప్పుడెందుకు కనిపించట్లేదో చెప్పే దమ్ము ప్రభుత్వానికి ఉందా?

జగన్ తల్లి విజయలక్ష్మి కోపంగా ఉన్న మాట వాస్తవం కాదా..? చెల్లి షర్మిల మాట వినడం లేదని వైసీపీనే చెప్పింది కదా..? షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం నిజం కాదా..? ఏమైనా చెప్పాలనుకుంటే సమాధానం చెప్పాలి కానీ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం చేస్తారా..? ఒక్కరిని కొడితే పదిమంది తిరిగి కొడతారు.. జాగ్రత్త.

కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్స్ చేసే స్థాయిలో కొందరు పోలీసులు ఆలోచన చేస్తున్నారు. రక్షణ కల్పించాల్సిందిగా అయ్యన్నపాత్రుడు కోర్టుకెళ్లారు. ప్రధాని కార్యక్రమంలో పాల్గొంటానని రక్షణ కల్పించాలని ఎంపీ రఘు రామకృష్ణ రాజు కోర్టుని ఆశ్రయించారు. వైసీపీ నేతలు ఇక్కడే ఉంటారుగా..? మీ మీ ప్రాంతాల్లో తిరగాలిగా..? చూద్దాం” అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ట్రెండింగ్ వార్తలు