Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి

మెట్టవలసలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారిని నాలుగు వీధి కుక్కలు గొంతు పట్టుకొని తీసుకెళ్లడాన్ని స్థానికులు చూశారు.

Srikakulam : శ్రీకాకుళం జిల్లా జి.సిగడ మండలం మెట్టవలసలో తీవ్ర విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందారు. చిన్నారి సాత్వికను వీధి కుక్కలు అత్యంత దారుణంగా కరిచి చంపేశాయి. వీధి కుక్కల దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స మృతి చెందారు. చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు.

చిన్నారిని చూసి తల్లిదండ్రులతోపాటు కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. శుక్రవారం మెట్టవలసలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారిని నాలుగు వీధి కుక్కలు గొంతు పట్టుకొని తీసుకెళ్లడాన్ని స్థానికులు చూశారు. అక్కడ 10 నిమిషాలు వెతకగా చిన్నారి టేకు ఆకుల్లో పడి ఉండటాన్ని గమనించారు.

Dogs Attack: ఐదేళ్ల బాలుడిపై కుక్కల దాడి.. ఆస్పత్రికి తరలిస్తుండగా బాలుడు మృతి

చికిత్స కోసం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందారు. చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు