AP politics : తాడేపల్లిలో గన్నవరం పంచాయితీ..వల్లభనేని వంశీ..దుట్టా రామచంద్రరావులను పిలిపించిన సీఎం జగన్

గన్నవరం వైసీపీలో ఆదిపత్యం పోరు రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీలో గ్రూపు తగాదాలకు ఫుల్ స్టాప్ పడని క్రమంలో తాజాగా గన్నవరం వంశీ, దుట్టాల పంచాయితీ తాడేపల్లి సీఎం జగన్ వద్దకు చేరింది.

AP politics :గన్నవరం వైసీపీలో ఆదిపత్యం పోరు రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీలో గ్రూపు తగాదాలకు ఫుల్ స్టాప్ పడని క్రమంలో తాజాగా గన్నవరం వంశీ, దుట్టాల పంచాయితీ తాడేపల్లి సీఎం జగన్ వద్దకు చేరింది. వైసీపీ పెద్దలతో పాటు స్వయంగా సీఎం జగన్ ఎన్నిసార్లు మందలించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావుల మధ్య విబేధాలు ఏమాత్రం సమసిపోవటంలేదు. సరికదా ఇవి రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటికైనా వాటిని ఫుల్ స్టాప్ పెట్టాలని జగన్ భావించి ఇద్దరుని తాడేపల్లి పిలిపించారు.బుధవారం (మే 18,2022)సాయంత్రం 6 గంటలకు తాడేపల్లి రావాలని సూచించారు. కొంతకాలంగా వంశీ, దుట్టా వర్గాల మధ్య గన్నవరంలో వర్గపోరు నడుస్తోంది. దీంతో ఈ పోరుకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్న సీఎం జగన్ వారిద్దరిని తాడేపల్లికి పిలిపించకున్నారు. మరి కాసేపట్లో వంశీ, దుట్టాలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. వైసీపీలో పెరుగుతున్న విభేధాలు ఎన్నికలపై ప్రభావం చూపించవచ్చు. దాంతో ఎన్నికలకు ముందే వాటినిక సమసిపోయేలా చేయటానికి సీఎం యత్నిస్తున్నారు.

Also read : గన్నవరం పొలిటిక్స్…శుభవార్త చెబుతానన్న దట్టు రామచంద్రారావు ? ఎమ్మెల్యే అభ్యర్థా ?

గన్నవరం అంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట… 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి వల్లభనేని వంశీ విజయం సాధించారు. ఈయన టీడీపీలో ఉండగా, వైసీపీ నేతలకు, కార్యకర్తలకు చుక్కలు కనిపించాయని చెబుతూ వుంటారు. అటువంటి వంశీ వైసీపీకి జై కొట్టారు. అప్పటినుంచి గన్నవరం వైసీపీలో ఎప్పుడూ ఏదొక రచ్చ జరుగుతూనే ఉంది.దటీజ్ వంశీల అనేలా ఉంటాయి ఆ రచ్చలన్నీ.

తాజాగా వంశీకి.. వైసీపీ నేతలు దుట్టా రామచంద్రారావు, యార్లగడ్డ వెంకట్రావుల మధ్య రచ్చ జరుగుతోంది. వీరు వంశీ వర్గంపై ఎప్పటికప్పుడు ఫైర్ అవుతూనే ఉన్నారు. అలాగే వంశీ తన సొంత వర్గానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ…అసలైన వైసీపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉంటే ఇటీవల గన్నవరం వైసీపీ ఇంచార్జ్‌ని నియమించాలని కార్యకర్తలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. వంశీని పక్కన పెట్టి నిజమైన వైసీపీ నాయకుడికి ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నారు.

Also read : Gyanvapi Masjid : ‘గతంలో దేవాలయాలే ఇప్పుడు మసీదులుగా మారాయి’ ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

ఈ క్రమంలోనే తాజాగా… గడపగడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభం కావడంతో మరోసారి ఎమ్మెల్యే వల్లభనేని వ్యతిరేక వర్గం తెరపైకి వచ్చింది. 2024లో పార్టీ టికెట్ వంశీకి కేటాయిస్తే సహకరించేది లేదని బహిరంగంగానే చెబుతున్నారట కార్యకర్తలు.ఈ క్రమంలో నియోజకవర్గంలో వైసీపీకి కొత్త ఇంఛార్జ్ కావాలంటూ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. అలాగే జగన్ ని కలిసి వంశీకి సీటు దక్కకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్. అయితే వైసీపీ అగ్రనేతలతో వంశీకి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. దీంతో వంశీకి చెక్ పెట్టటం సాధ్యం కాదనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానికి ఆప్తమిత్రుడు కాబట్టి వంశీకి సీటు విషయంలో ఢోకా లేదని ప్రచారం జరుగుతోంది. 2024లో గన్నవరం వైసీపీ సీటు తమ నేతకే అని వంశీ వర్గం ధీమా వ్యక్తంచేస్తోంది. ఈక్రమంలో తాడేపల్లిలో సీఎంతో జరిగే సమావేశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు