గన్నవరం పొలిటిక్స్…శుభవార్త చెబుతానన్న దట్టు రామచంద్రారావు ? ఎమ్మెల్యే అభ్యర్థా ?

  • Publish Date - August 24, 2020 / 10:38 AM IST

సీఎం జగన్ ఆదేశిస్తే…తాను గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని, 15 రోజుల్లో పార్టీ కేడర్ కు చల్లని కబరు చెబుతానని స్థానిక వైసీపీ నేత దట్టు రామచంద్రారావు ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ చల్లని కబురు ఏంటీ ? దుట్టాకు పదవి ఇస్తానని సీఎం జగన్ హామీనిచ్చారా ?



నియోజకవర్గంలో ఏమి జరుగబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. Krishna జిల్లా గన్నవరంలో నియోజకవర్గ వైసీపీలో వర్గ విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..స్థానిక వైసీపీ నేత దట్టు రామచంద్రారావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

ఈ క్రమంలో రామచంద్రారావు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..తానే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ వంశీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తాను 40 ఏళ్లుగా…వైఎస్ కుటుంబంతో నడిచినట్లు, వైఎస్ తో అప్పటి నుంచి పరిచయం ఉందన్నారు.



నేటికీ వైసీపీ కుటుంబంతోనే నడుస్తున్నాననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన తర్వాత..ఆయనతో కలిసి నడుస్తున్నట్లు చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో ఏ పని చేసినా తనతో సీఎం జగన్ సంప్రదించి చేస్తారన్నారు.

జగన్ ఏదీ చెప్పినా తాను తు.చ తప్పకుండా పాటించానని, పదేళ్లు టీడీపీలో ఉన్న వల్లభనేని వంశీ..వైసీపీ క్యాడర్ ను ఇబ్బంది పెట్టారన్నారు. వెంట వచ్చిన వారికి పదవులిస్తూ..అసలైన వైసీపీ లీడర్స్ ను వేధిస్తున్నారని తెలిపారు.



ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉంది ఇందుకేనా ? అని సూటిగా ప్రశ్నించారు. నిన్నగాక నిన్న వచ్చిన వంశీ…తమ పార్టీకి చెందిన కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పదేళ్ల పాటు టీడీపీతో పోరాటం చేశామని, కేసులు పెట్టినా భయపడలేదన్నారు. వైసీపీలో కొనసాగుతానని, తన ఊపిరి ఉన్నంత వరకు పార్టీలో కొనసాగుతానన్నారు.



ట్రెండింగ్ వార్తలు